India's Squad for T20 World Cup 2024: ఐపీఎల్ తర్వాత అందరి కళ్లు టీ20 ప్రపంచకప్ పైనే. ఈ మెగా టోర్నీ జూన్ 01నుంచి వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ లో తొలిసారి 20 జట్లు పాల్గొనబోతున్నాయి. టీ20 వరల్డ్ కప్ కు జట్లను ప్రకటించేందుకు మే 01న తుది గడువుగా నిర్ణయించింది ఐసీసీ. దీంతో ఆయా జట్లన్నీ ఆటగాళ్లను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. బీసీసీఐ కూడా దీని కోసం సమాయత్తం అవుతోంది. ఈ రెండు మూడు రోజుల్లో భారత జట్టును ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు ఈ ప్రపంచకప్ లో భారత జట్టు ఎలా ఉండబోతుందనే విషయంపై మాజీలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇప్పటికే మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ గురించి చెప్పగా.. ఇప్పుడు మరో మాజీ క్రికెటర్ వసీం జాపర్ ఈ మెగా టోర్నీ కోసం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించాడు. ఈ టీమ్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ను ఎంచుకున్నాడు. ఫస్ట్ డౌన్ లో విరాట్ కోహ్లీ, సెకండ్ డౌన్ లో సూర్యకుమార్ యాదవ్ లకు చోటు కల్పించాడు. బ్యాటర్లు కేటగిరీలో శుభ్ మన్ గిల్ కు ఫ్లేస్ దక్కలేదు. దినేశ్ కార్తీక్, రియాన్ పరాగ్ లను కాదని.. నయా ఫినిషర్ రింకూ సింగ్ కు స్థానం ఇచ్చాడు.
ఇదిలా ఉండగా.. వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్, సంజూ శాంసన్‌లకు ఎంపిక చేసిన జాఫర్.. కేఎల్ రాహుల్‌కు మాత్రం మొండిచేయి చూపించాడు. ఆల్ రౌండర్ల కేటగిరీలో రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, శివం దూబేలకు చోటు కల్పించాడు. పేసర్లుగా జస్ ప్రీత్ బుమ్రాతో పాటు మహహ్మద్ సిరాజ్, అర్ష్ దీప్ సింగ్ లను తీసుకున్నాడు. స్పిన్ కేటగిరీలో కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ కు ఫేస్ ఇచ్చాడు.
Also Read: DC vs MI Highlights: 'ఆ తెలుగు కుర్రాడే మా ఓటమికి కారణం'.. హార్దిక్ పాండ్యా సంచలన వ్యాఖ్యలు
వసీం జాఫర్ సెలక్ట్ చేసిన భారత జట్టు ఇదే:
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్, రవీంద్ర జడేజా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter