Ravichandran Ashwin Rare milestone: రాజ్ కోట్ టెస్టులో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సాధించాడు. ఇంగ్లండ్ ఓపెనర్ క్రాలే వికెట్ తీయడం ద్వారా 500 టెస్టు వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. ఇతడి కంటే ముందు మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే(619 వికెట్లు) ఉన్నాడు. అత్యంత వేగంగా 500 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా (98 మ్యాచ్‌లు) అశ్విన్, ముత్తయ్య మురళీధరన్ (87 మ్యాచ్‌లు) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. స్వదేశంలో 21.26 సగటుతో 351 వికెట్లు, విదేశాల్లో 30.40 యావరేజ్ తో 149 వికెట్లు తీశాడు అశ్విన్. మెుత్తానికి 500 వికెట్ల క్లబ్ లో చేరిన తొమ్మిదో ఆటగాడు. ఈ ఆఫ్ స్పిన్నర్ 116 వన్డేల్లో156 వికెట్లు, 65 టీ20ల్లో 72 వికెట్లు తీశాడు.
రాజ్‌కోట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాను 445 పరుగులకు ఆలౌట్ అయింది. రోహిత్, జడేజా సెంచరీలు చేశారు. ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ అదరగొట్టారు. సర్ఫరాజ్ హాఫ్ సెంచరీ చేయగా.. ధ్రువ్ 46 పరుగులతో రాణించాడు. ఇటు బౌలింగ్ లోనే కాదు.. బ్యాటింగ్ లో కూడా రాణించాడు అశ్విన్. మార్క్ వుడ్ నాలుగు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన స్టోక్స్ సేన ధీటుగా బదులిస్తోంది. ముఖ్యంగా ఓపెనర్ బెన్ డకెట్ టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 88 బంతుల్లోనే సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 238 పరుగులు వెనుకబడి ఉంది.
Also Read: IND vs ENG 3rd Test live: టీమిండియాకు దీటుగా బదులిస్తున్న స్టోక్స్ సేన.. దంచికొట్టిన డకెట్..
Also Read: HCA Cricket Coach: క్రికెట్‌కే మాయని మచ్చ.. మద్యం తాగుతూ బస్సులో మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి