Jamaican sprint legend Usain Bolt Loses 12 Million Dollers In Financial Scam: ప్రపంచ ఎవర్ బెస్ట్ స్ప్రింటర్, జమైకా చిరుత ఉసేన్ బోల్ట్‌కు చేదు అనుభవం ఎదురైంది. బోల్డ్ అకౌంట్ నుంచి 12.7 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 103 కోట్లు) మాయమైనట్లు సమాచారం. ఓ ప్రైవేటు సంస్థలో జమైకా చిరుత పెట్టుబడిగా.. ఈ డబ్బులను ఆ సంస్థకు చెందిన ఓ మాజీ ఉద్యోగి భారీ స్కామ్ చేసినట్లు తెలుస్తోంది. నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడి బోల్డ్ డబ్బును దోచుకున్నాడట. ఆ మనీ అంతా బోల్ట్ లైఫ్‌టైమ్ సేవింగ్ డబ్బులని అతని లాయర్ తెలిపారు.
జమైకాకు చెందిన స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (ఎస్‌ఎస్‌ఎల్) సంస్థలో ఉసేన్ బోల్ట్ కొన్నేళ్ల కిందట పెట్టుబడి ఖాతా తెరిచాడు. రిటైర్మెంట్, లైఫ్‌టైం సేవింగ్స్‌లో భాగంగా జమైకా చిరుత ఈ ఖాతాను కొనసాగిస్తున్నాడు. ఎస్‌ఎస్‌ఎల్‌లో 12.8 మిలియన్ డాలర్లు ఉండగా.. 2023 జనవరి రెండో వారం నాటికి 12000 డాలర్ల బ్యాలెన్స్ మాత్రమే ఉంది. ఎస్‌ఎస్‌ఎల్ కంపెనీలో జరిగిన భారీ స్కామ్ కారణంగా బోల్ట్ డబ్బులు మాయమైనట్లు అతడి న్యాయవాది ఆరోపించారు. పది రోజుల్లోగా డబ్బును తిరిగి ఖాతాలో జమచేయాలని, లేదంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కంపెనీని హెచ్చరించారు.
ఈ మోసాన్ని 2023 జనవరి ఆరంభంలోనే గుర్తించినట్లు ఎస్‌ఎస్‌ఎల్ తెలిపింది. తన సంస్థకు చెందిన ఓ మాజీ ఉద్యోగి చేసిన స్కామ్ కారణంగా.. తమ క్లయింట్స్ ఖాతాల్లో నుంచి మిలియన్ డాలర్లు మాయమైనట్లు జనవరి 12న కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉసేన్ బోల్ట్ సహా 30 మంది ఖాతాదారులు డబ్బులు కోల్పోయినట్లు చెప్పింది. ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశామని, ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోందని కంపనీ తెలిపింది. తమ ఖాతాదారుల ఆస్తులను మరింత భద్రంగా చూసుకొనేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్‌ఎస్‌ఎల్ చెప్పుకొచ్చింది.
జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ 2017లో అథ్లెటిక్స్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల పాటు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ ఈవెంట్స్‌ను బోల్ట్ శాసించాడు. బోల్ట్ ఉంటే పథకం పక్కా అనేంతలా తన ప్రభావం చూపాడు. 100, 200, 400 మీటర్ల విభాగంలో పరుగుల రారాజుగా జమైకా చిరుత నిలిచాడు. వరుసగా ఎనిమిదిసార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించి.. ఎవరికి సాధ్యం కాని రికార్డు నెలకొల్పాడు. 2008, 2012, 2016 ఒలింపిక్స్ పరుగుల పోటీల్లో ఎనిమిది బంగారు పతకాలు పట్టారు.
Also Read: Shani Amavasya Upay 2023: శనిశ్చరి అమావాస్య నాడు ఈ పనులు చేస్తే.. మీపై శని ప్రభావం అస్సలు ఉండదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.