If Yoga Teacher as Umpire: క్రికెట్ మ్యాచ్ జరగుతుండగా అంపైర్ యోగా చేస్తే?.. వీడియో వైరల్

If Yoga Teacher as Umpire: మహారాష్ట్ర లోకల్ క్రికెట్ టోర్నమెంట్ పురందర్ ప్రీమియర్ లీగ్ లో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. మ్యాచ్ లో వైడ్ బాల్ సిగ్నల్ ను అంపైర్ విచిత్రమైన సంజ్ఞ చేశాడు. సాధారణంగా చేతులతో వైడ్ బాల్ గా చూపిస్తారు.. కానీ, ఈ అంపైర్ క్రేజీగా ఆలోచించి కాళ్లతో సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 8, 2021, 09:13 AM IST
If Yoga Teacher as Umpire: క్రికెట్ మ్యాచ్ జరగుతుండగా అంపైర్ యోగా చేస్తే?.. వీడియో వైరల్

If Yoga Teacher as Umpire: క్రికెట్లో అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు జరగడం ఇప్పుడు మామూలే అయిపోయింది. ఇటీవలే కొన్ని అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లలో ప్రేక్షకులు కొందరు పాపులారిటీ సంపాందించుకునేందుకు మైదానంలోకి వచ్చి హడావుడి చేసిన విషయం తెలిసిందే. కానీ, మ్యాచ్ ఆడుతున్న క్రమంలో అంపైర్ అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఓ ఫీట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహారాష్ట్ర లోకల్ క్రికెట్ టోర్నమెంట్ పురందర్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా అంపైర్ ఇచ్చిన రియాక్షన్ కు నెట్టింట విపరీతమైన స్పందన వస్తోంది. మ్యాచ్ లో వైడ్ బాల్ సిగ్నల్ ను చేతులతో సంజ్ఞ చూపించకుండా.. తలక్రిందులుగా ఉంటూ రెండు కాళ్ల సహాయంతో వైడ్ బాల్ అని సిగ్నల్ ఇచ్చాడు. 

ఈ వీడియోను ఓ ఐఏఎస్ అధికారి ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. “క్రికెట్, యోగా రెండు కలిస్తే? “ అనే క్యాప్షన్ ఇచ్చాడు. దీనిపై నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ వీడియోకు ఇప్పటి వరకు 1.1 మిలియన్ వ్యూస్ సహా 3 వేలకు పైగా లైక్స్, 367 రీటీట్స్ లభించాయి.

ఈ క్రేజీ వీడియో చూసిన కొందరు నెటిజన్లు విచిత్రంగా కామెంట్స్ చేస్తున్నారు. “రామ్ దేవ్ బాబా ఆ టీమ్ ఓనర్ గా ఉండి ఉంటాడు. అతడికి అర్థం కావడానికే ఇలా చేసి ఉంటారు“ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. యోగా టీచర్ పార్ట్ టైమ్ అంపైరింగ్ చేస్తున్నాడని మరికొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

ALso Read: Birthday cake viral video: బర్త్ డే కేక్ కట్ చేయబోతే.. జుట్టుకు నిప్పంటుకున్న వీడియో

Also Read: Scary Video: చెమటలు పట్టిస్తున్న వీడియో..వ్యక్తిపైకి కింగ్ కోబ్రా ఎలా ఎగబడుతుందో చూడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News