Virat Kohli Farmhouse: 8 ఎకరాల ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేసిన కోహ్లీ, అనుష్క.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Virat Kohli Farmhouse, Virat Kohli buy luxurious farmhouse in Alibaug. టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఖరీదైన ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 3, 2022, 04:03 PM IST
  • 8 ఎకరాల ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేసిన కోహ్లీ
  • ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
  • దశాబ్దం క్రితం అలీబాగ్‌లో ఇల్లు
Virat Kohli Farmhouse: 8 ఎకరాల ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేసిన కోహ్లీ, అనుష్క.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Virat Kohli and Anushka Sharma buy 19 crores worth 8 acres Farmhouse: టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఖరీదైన ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేశారు. మహారాష్ట్రలోని అలీబాగ్‌లో  8 ఎకరాల ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేశారు. అలీబాగ్‌లోని జిరాద్ అనే గ్రామానికి సమీపంలో ఈ 8 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలం కోసం విరుష్క దంపతులు దాదాపు రూ. 19.24 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు సమాచారం. కోహ్లీ- అనుష్కలు 1.15 కోట్ల రూపాయల స్టాంప్‌ డ్యూటీ చెల్లించినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆసియా కప్ 2022 కోసం దుబాయ్‌లో ఉన్నా.. 8 ఎకరాల స్థలంకు సంబందించిన లావాదేవీలు గణేష్ చతుర్థికి ఒక రోజు ముందు పూర్తయ్యాయని సమాచారం. విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ ఈ విషయాలు అన్ని దగ్గరుండి చూసుకున్నాడట. 8 ఎకరాల స్థలంకు సంబంధించి లావాదేవీని 'సమీరా హ్యాబిటాట్స్' అనే రియల్ ఎస్టేట్ కంపెనీ పర్యవేక్షించిందని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. 

అనుష్క శర్మ, విరాట్‌ కోహ్లీలు ఆరు నెలల క్రితం ఆ స్థలాన్ని సందర్శించారట. బిజీ క్రికెట్ షెడ్యూల్ కారణంగా.. విరాట్ అలీబాగ్‌కు వచ్చి ఈ డీల్ చేయలేకపోయాడు. వ్యాపారవేత్తలు, సినీ నటులు మరియు క్రికెటర్లు అలీబాగ్ పరిసరాలలో భూమిని కొనుగోలు చేసి.. గృహాలను నిర్మిస్తున్నారు. భారత మాజీ క్రికెటర్, కోచ్ రవిశాస్త్రి కూడా దశాబ్దం క్రితం అలీబాగ్‌లో ఇల్లు నిర్మించుకున్నారు. 

భారత జట్టులో కీలక ఆటగాడైనవిరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ కాకుండా పలు సంస్థలకు ప్రచారకర్తగా ఉండడంతో కోట్లు సంపాదిస్తున్నాడు. పలు రంగాలలో పెట్టుబడులు పెట్టి లాభాలు గడిస్తున్నాడు. ఇక బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ సైతం సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సినిమా, ప్రకటనల ద్వారా ఆమె కూడా బాగానే వెనకేశారు. 

Also Read: SRH Coach: కావ్యా మారన్ సంచనలన నిర్ణయం.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో కీలక మార్పు!

Aslo Read: తెలుగులో మాట్లాడి ఆశ్చర్యపరిచిన రణ్‌బీర్‌.. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండంటూ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News