Yashasvi Jaiswal Debut : ఒకప్పుడు పానీ పూరీ అమ్మిన కుర్రాడు.. ఇవాళ టీమిండియాలోకి అరంగేట్రం

Yashasvi Jaiswal Debut for India Against West Indies: టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో భాగంగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో వెస్ట్ ఇండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే వెస్టిండీస్ జట్టు 2-0 తో ఆధిక్యంలో ఉండగా నేడు జరుగుతున్న మూడో T20I మ్యాచ్ సిరీస్‌ని శాసించే మ్యాచ్ కానుంది. 

Written by - Pavan | Last Updated : Aug 9, 2023, 12:12 AM IST
Yashasvi Jaiswal Debut : ఒకప్పుడు పానీ పూరీ అమ్మిన కుర్రాడు.. ఇవాళ టీమిండియాలోకి అరంగేట్రం

Yashasvi Jaiswal Debut for India Against West Indies: టీమిండియా చరిత్రలో ఇదొక మరిచిపోలేని రోజు.. బీసీసీఐలో ఎన్నో రాజకీయాలు ఉంటాయని.. డబ్బులు, పైరవీలు చేసే వారికే టీమిండియాలో చోటు లభిస్తుంది అని అప్పుడప్పుడు తెరపైకి వచ్చే ఆరోపణలను కొట్టిపారేస్తూ ఒక సామాన్యుడు.. టీమిండియా తరపున తెరంగేట్రం చేస్తోన్న రోజు ఇది. రాజస్థాన్ రాయల్స్ యువ కెరటం యశస్వి జైశ్వాల్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఐపిఎల్ టోర్నీలో రాణించిన ఈ యువ సంచలనం ఇప్పుడు టీమిండియాలో అడుగుపెట్టాడు. అవును, భారత యువ బ్యాటింగ్ సంచలనం యశస్వి జైశ్వాల్ మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన టీ20 క్రికెట్‌లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఒకప్పుడు పానీ పూరీ అమ్ముకుంటూ తండ్రికి చేదోడువాదోడుగా ఉన్న యశస్వి జైశ్వాల్ ఇక ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ అని పిలిపించుకోనున్నాడు. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం ఈ అద్భుతమైన క్షణాలకు వేదికైంది. 

టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో భాగంగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో వెస్ట్ ఇండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే వెస్టిండీస్ జట్టు 2-0 తో ఆధిక్యంలో ఉండగా నేడు జరుగుతున్న మూడో T20I మ్యాచ్ సిరీస్‌ని శాసించే మ్యాచ్ కానుంది. టీమిండియాకు ఈ మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్. ఈ పోరులో గెలిస్తేనే సిరీస్‌పై ఏమైనా ఆశలు సజీవంగా ఉంటాయి. లేదంటే సిరీస్ చేజారినట్టే.

 

యశస్వి జైశ్వాల్ ఎంట్రీతో ఈ యువ క్రికెటర్ అభిమానులు తమ అభిమానాన్ని చాటుకోలేకుండా ఉండలేకపోతున్నారు. ఒకప్పుడు పానీ పూరీ, చాట్ బండార్ అమ్మిన పేదింటి కుర్రోడికి ఈరోజు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం నిజంగా స్పూర్తిదాయకం అంటూ జైశ్వాల్ జై కొడుతున్నారు.

 

 

 

 

 

ఇది కూడా చదవండి : IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో కీలక మార్పు, కొత్త కోచ్‌గా వెట్టోరి నియామకం

వెస్టిండీస్ ( ప్లేయింగ్ XI ) : బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్ (w), రోవ్‌మన్ పావెల్ (c), షిమ్రాన్ హెట్మెయర్, రొమారియో షెపర్డ్, రోస్టన్ చేజ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్.

భారత్ ( ప్లేయింగ్ XI ) : శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (సి), సంజు శాంసన్ (w), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ , ముఖేష్ కుమార్.

ఇది కూడా చదవండి : World Cup 2023: ప్రపంచకప్‌కు ఆసీస్ జట్టు ప్రకటన.. స్టార్ బ్యాట్స్‌మెన్‌కు మొండి చేయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News