తెలంగాణలో లాక్ డౌన్ కారణంగా ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బ్యాంక్ ఖాతాలతో ఆధార్ కార్డు నెంబర్ లింక్ చేసుకోని వారి ఖాతాల్లో నగదు జమ కాకపోవడం నిజమేనన్న ఆయన.. అలా ఖాతాలో నగదు జమ కాని వారికి నేరుగానే నగదు అందిస్తామని తెలిపారు.
పాన్ కార్డును ఇంకా ఆధార్ కార్డుతో జత చేసుకోని వారు ఎవరైనా ఉంటే... వారికి 31 మార్చి తర్వాత తిప్పేలా లేవు. అవును, పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాల్సిందిగా ఇదివరకే సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) సూచించిన సంగతి తెలిసిందే.
ఆధార్ కార్డు.. దేశంలో ఎక్కడైనా అడ్రస్ ప్రూఫ్ కోసం చెల్లుబాటయ్యే ప్రధానమైన ఐడి కార్డుల్లో ఆధార్ కూడా ఒకటి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మీరు దేశంలో ఎక్కడ నివసిస్తున్నా... మీ ప్రస్తుత చిరునామాపైకి ఆధార్ కార్డును కూడా సులువుగా మార్చుకోవచ్చనే విషయం చాలామందికి అవగాహన లేదు.
తాము పనిచేస్తున్న కంపెనీలకు పాన్ కార్డ్, ఆధార్ వివరాలను సమర్పించని ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. రూ.2.5 లక్షలు, అంతకంటే ఎక్కువ వార్షిక వేతనం పొందే ఉద్యోగులు 20 శాతం జీతాన్ని పన్ను కింద చెల్లించాల్సి ఉంటుందని సర్క్యూలర్ జారీ అయింది.
మీకు ఆధార్, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి వంటి డాక్యుమెంట్స్ ఉన్నాయా ? అయితే, జాతీయ జనాభా పట్టిక (NPR) నమోదులో భాగంగా ఈ వివరాలు తప్పనిసరిగా ప్రభుత్వానికి సమర్పించాల్సిందేనని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది.
"ఆధార్" పథకం ద్వారా "ఒకే జాతి, ఒకే గుర్తింపు" అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం అందరినీ ఒకే తాటి వైపు తీసుకురావడం తప్పెలా అవుతుందని సుప్రీం కోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఆధార్ లింకింగ్‌పై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ దాఖలైన విజ్ఞప్తులపై నేడు సుప్రీం కోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో ఆధార్ గురించి తెలుసుకోవాల్సిన పలు కీలక అంశాలపై ఓ లుక్కేద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.