Captain Amrinder Singh: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్‌సింగ్ ఓటమి పాలయ్యారు. ఆప్ అభ్యర్థి అజిత్‌పాల్ కోహ్లి చేతిలో ఓటమి చెందారు.
Punjab Assembly Election Results, AAP in Lead. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలనం సృష్టించింది. ఈరోజు జరుగుతున్న కౌంటింగ్‌లో లీడింగ్‌లో కొనసాగుతోంది. అంతేకాదు ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతోంది.
Goa Results 2022: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. హంగ్ ఏర్పడుతుందనే ఎగ్జిట్ పోల్స్ సర్వేల నేపధ్యంలో అందరి దృష్టీ గోవాపై పడింది. పాశ్చాత్త సంస్కృతి నిండా కన్పించే గోవాలో..అప్పుడే క్యాంపు రాజకీయాలు ప్రారంభమవుతున్నాయి.
Punjab AAP CM Candidate: దేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక కోసం ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. 'జనతా చునేగీ అప్నా సీఎం (ప్రజలే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేస్తారు) క్యాంపెయిన్ పేరిట ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహిస్తున్న ఈ టెలీ ఓటింగ్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
Arvind Kejriwal's Goa Promise: గోవా ఒక అందమైన రాష్ట్రం , భగవంతుడు గోవాకు అన్నీ ఇచ్చాడని, కానీ రాజకీయ పార్టీలు గోవాను దోపిడీ చేశాయని అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. మేము ఈ దోపిడీని అరికట్టాలని విస్తృతమైన ప్రణాళికను రూపొందించామని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Arvind kejriwal: దేశ రాజధానిని పాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలకు సై అంటోంది. ఇతర పార్టీలకు సవాలు విసురుతోంది. ఆరు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నామని ఆప్ వెల్లడించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీకు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. హిందూవాహిని పేరుతో గుర్తు తెలియని వ్యక్తి బెదిరిస్తున్నట్టు తెలిసింది. ఢిల్లీ నార్త్ ఎవెన్యూ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
AAP: ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. ఢిల్లీలో మూడోసారి అధికారం చేపట్టిన తరువాత పార్టీని విస్తరించే క్రమంలో యూపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
దేశ వ్యాప్తంగా రైతుల భారత్ బంద్ (Bharat Bandh) ప్రశాంతంగా కొనసాగుతోంది. అన్ని విపక్ష పార్టీలు, రైతు, కార్మిక సంఘాలు రోడ్లపై భైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు (Delhi Police) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal ) ను గృహ నిర్బంధంలో ఉంచినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ (APP) ట్వీట్ చేసింది.
మత విద్వేష వ్యాఖ్యలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఇటీవల కర్ణాటకలో జరిగిన ఘటన నిదర్శనం. దేవుళ్లపై కామెంట్లు చేసిన పార్టీ మాజీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP suspends Jarnail Singh) వేటు వేసింది.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రజలు అందించిన అధికారాన్ని సైతం ఆ పార్టీ నిలబెట్టుకోలేకపోతోంది. కరిష్మా ఉన్న పార్టీ నేతలు ఒక్కొక్కరిగా వదిలిపోతున్నారు. ఈ నేపద్యంలో వెంటిలేటర్ పై ఉన్న ఆ పార్టీకు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఆప్ ( AAP ) సన్నాహాలు చేస్తోంది. ఆప్ అధికార ప్రతినిధి రాఘవ్ చడ్డా వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.
ఢిల్లీలో ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఈ జాబితాలోకి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ చేరారు. ఆయన గత రెండు రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలు, జ్వరంలో బాధపడుతున్నారు. టెస్టులు నిర్వహించగా కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది.
ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కేజ్రీవాల్ కేబినెట్ మంత్రులతో ఎల్జీ అనిల్ బైజాల్ ప్రమాణ స్వీకారం చేయించారు.
దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రిగా ముచ్చటగా మూడోసారి అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకే అనుకూలంగా ఉన్నాయి. దీంతో మరోసారి ఢిల్లీ పీఠాన్ని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దక్కించుకున్నట్లయింది.
ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఐతే ఆమ్ ఆద్మీ పార్టీ జోరుగా ఆధిక్యంలో దూసుకెళ్తోంది. దీంతో ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి విజయం తథ్యమైందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిపోయింది. అభివృద్ధికి పట్టం కడతామని ప్రజలు తీర్పు ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది. అంతా ముందు ఊహించిన విధంగానే ఢిల్లీ ఎన్నికల్లో దేశ రాజధాని ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టినట్లుగా కనిపిస్తోంది. గత ఐదేళ్ల మళ్లీ కావాలని కోరుకుంటున్నట్లుగా అనిపిస్తోంది.
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ. .. జోరుగా దూసుకు వెళ్తోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు 57 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఢిల్లీ ఫలితాల వెల్లడి కోసం అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. కేజ్రీవాల్ పార్టీ దాదాపు 50 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.