Pawan Kalyan Meets Vizag Woman: విశాఖలో అర్ధరాత్రి వేళ ఓ మహిళ ప్రదర్శించిన తెగువకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఆమె ఒడిలో చంటి బిడ్డను పెట్టుకుని.. భుజాన జెండా పెట్టుకుని పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూసింది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
నిర్మాత నూతన్ నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకోవడం (Nuthan Naidu Arrested) తెలిసిందే. తాజాగా నూతన్ నాయుడు మరో కేసులో ఇరుక్కున్నాడు. మెడికల్ రిపోర్టులో వివరాలు మార్పించేందుకు యత్నించాడంటూ డాక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు
ఏపీలో కోవిడ్19 టెస్టుల సంఖ్య పెరిగేకొద్దీ మొదట్లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. తాజాగా భారీగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ (Home Quarantine in AP) కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏపీకి మూడు రాజధానులు అంటూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని టీడీపి నాయకురాలు, మాజీ మంత్రి అఖిలప్రియ మండిపడ్డారు. మూడు రాజధానుల ఏర్పాటుపై జిఎన్ రావ్ నివేదిక ఇవ్వకముందే ఆ విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించారంటే.. ఆ రిపోర్టును ఎవరు తయారు చేశారో స్పష్టంగా అర్థం అవుతోంది.
అమరావతి నుంచి ఏపీ రాజధానిని మరొక చోటుకు మార్చకుండా అడ్డుకోవాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు నేడు బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరిని కలిశారు. తమ వ్యవసాయ భూములను వదులుకుని రాజధాని అభివృద్ధి కోసం ఇస్తే.. ఇప్పుడు రాజధానిని అక్కడి నుంచి మరొక చోటుకు తరలిస్తామంటే ఎలా అని అమరావతి రైతులు పురందేశ్వరి వద్ద తమ ఆవేదన వ్యక్తంచేశారు.
ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదన రాష్ట్రంలో తీవ్ర చర్చనియాంశమైన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఓవైపు చర్చలు జరుగుతుండగానే తాజాగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో మళ్లీ దర్యాప్తు మొదలైంది. ఇందులో భాగంగా ఆమె మృతదేహానికి రీ పోస్ట్మార్టం నిర్వహించేందుకు సీబీఐ అధికారులు సిద్ధమయ్యారు. గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట శ్మశానవాటికలో ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్టు మార్టం జరగనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి తెనాలి పోలీసులకు, గుంటూరు జిల్లా కలెక్టర్కు, వైద్యులకు సీబీఐ అధికారులు సమాచారం అందించారు. రీ పోస్ట్ మార్టం కోసం పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో కలిసి సీబీఐ అధికారులు చెంచుపేట శ్మశానవాటికకు చేరుకున్నారు. సమాధి గుర్తింపు పని కూడా పూర్తి చేశారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి(MGNREGA) సంబందించిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు ధర్నాకు దిగారు. ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్వర్యంలో టిడిపికి చెందిన శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు వెంటనే నిధులు విడుదల చేయాలని నిరసన తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.