2 day Vanijya Utsav : ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. అనంతరం వాణిజ్య ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్ సందర్శించారు.
AP Corona Update: ఏపీలో కరోనా వైరస్ సంక్రమణ స్థిరంగా కొనసాగుతోంది. కరోనా సంక్రమణ పెరగకుండా ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.
Night Curfew: కరోనా మహమ్మారి నియంత్రణకై ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
AP Zilla Parishad Counting: ఆంధ్రప్రదేశ్ జిల్లా పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా రేపు కౌంటింగ్ ప్రారంభం కానుంది. కోవిడ్ నిబంధలు, భారీ భద్రత మధ్య ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.
AP State Housing Corporation:వన్ టైమ్ సెటిల్మెంట్ విధానం వల్ల ఏపీలో 46,61,737 మందికి లబ్ధి చేకూరుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన తాజాగా సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. ఇందులో ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నారు.
Ap Degree Admissions: ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ కళాశాల ప్రవేశానికి అడ్మిషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ విధానం ద్వారా అడ్మిషన్లు జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.
TTD Members List: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ప్రకటనపై అందరి దృష్టి నెలకొంది. మరో 2-3 రోజుల్లో పాలకమండలిని ప్రకటించనున్నారని తెలుస్తోంది. అదే సమయంలో సభ్యుల సంఖ్య పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.
AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ అందించింది. పదవీ విరమణ, ఇతర కారణాలతో ఉద్యోగాల్నించి వైదొలగిన వారికి పలు ప్రయోజనాలు కల్పించనుంది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.
APPSC: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్య గమనిక. డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈనెల 28 నుంచి 30 వరకు 3 రోజులపాటు సచివాలయ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు నిర్వహించనున్నారు.
Covid19 Instructions: కరోనా సంక్రమణ, కరోనా థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు కఠినమైన సూచనలు జారీ చేసింది. తీసుకోవల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారుల్ని ఆదేశించారు.
Tourism App: పర్యాటక రంగం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయి హోటళ్ల నిర్మాణం, పర్యాటక రంగం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోంది. త్వరలో సరికొత్తగా యాప్ ప్రవేశపెట్టబోతోంది.
Govt Online Movie Tickets : నచ్చిన స్టార్ సినిమా చూసేందుకు తెల్లవారుజాము నుంచే థియేటర్ వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా టికెట్ల (cinema tickets) కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది ఏపీ ప్రభుత్వం.
YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దికాలంగా రోడ్లు అధ్వాన్నంగా మారిపోయాయి. ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోని రోడ్ల నిర్మాణంపై సమీక్షించారు. అవసరమైన ఆదేశాలు జారీ చేశారు.
AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సంక్రమణ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే నిన్నటితో పోలిస్తే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గడం విశేషం. మరోవైపు కరోనా కట్టడికై రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.
AP HRC Office: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల దిశగా అడుగులు వేస్తోంది. న్యాయ రాజధానిగా ప్రకటించిన కర్నూలులో హెచ్ఆర్సి కార్యాలయం కొత్తగా ప్రారంభమైంది.
Tollywood: తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఇటీవల కొద్దికాలంగా మెగాస్టార్ చిరంజీవి పెదన్నగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మరోసారి సినీ పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ కానున్నాయి.
AP Government: ఏపీ ప్రభుత్వం కొత్త పరిశ్రమల స్థాపన దిశగా ముందుకెళ్తోంది. పారిశ్రామిక ప్రగతి లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. ప్రముఖ ఫ్లైవుడ్ తయారీ సంస్థ సెంచురీ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది.
PCV Vaccine: ప్రాణాంతకంగా మారిన న్యుమోనియోను ఇరికట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది.
Covid Vaccination: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇక నుంచి 18 ఏళ్లు దాటినవారికి సైతం వ్యాక్సిన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి 18 ఏళ్లు దాటినవారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.