పవన్ కల్యాణ్ పై టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాడ్లాడుతూ మొన్నటి వరకు టీడీపీ నేతలు పవన్ కల్యాణ్ భజన చేశారు. ఆయన చాలా మంచోడని పొగడ్తలతో ముంచెత్తారు. అవినీతి గురించి ప్రశ్నించేసరికి ఆయన చెడ్డవాడు అయిపోయాడని రోజా ఎద్దేవ చేశారు. పవన్ విమర్శించినట్లుగా ఆర్థిక నేరస్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేషేనన్నారు.
విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం విస్మరించిందని ఆరోపిస్తూ మోడీ సర్కార్ పై అవిశ్వాసం పెట్టాలని టీడీపీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి జాతీయ స్థాయిలో రాజకీయపార్టీలు మద్దతిచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తో పాటు వామపక్ష పార్టీలు సీపీఎం, సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఒక్క అకాలీదళ్ మినహా మిగిలిన విపక్ష పార్టీలన్నీ అవిశ్వాసానికి సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. ఎన్డీయే భాగస్వామి అయిన శివసేన పార్టీ కూడా అవిశ్వాసానికి సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది.
తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ వేగంగా స్పందించింది. ఏఎన్ ఐ కథనం ప్రకారం లోక్ సభలో టీడీపీ ప్రవేశపెట్టబోయే అవిశ్వాసానికి కాంగ్రెస్ పార్టీ తన పూర్తి మద్దతు తెలిపిింది.ఏపీ పీసీసీ చీఫ్ రఘవీరారెడ్డి ఈ మేరకు ప్రకటించారు. టీడీపీకి బద్ధవిరోధి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసానికి మద్దతు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. అవిశ్వాసంతో ఎన్డీయే సర్కార్ కు ఏం జరుగుతుందనే విషయం అటుంచితే.. కాంగ్రెస్ పార్టీ టీడీపీకి దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నారు. ఇదే జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమే అవుతుంది.
ఎన్డీయే నుంచి వైదొలగాలని సంచలన నిర్ణయం తీసుకున్న టీడీపీ.. మోడీ సర్కారును ఇరుకునపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందనే కారణంతో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు శుక్రవారం జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో టీడీపీ నిర్ణయం తీసుకుంది. అనంతరం టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు అవిశ్వాసం నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమయంలో ఎంపీలు సమన్వయంతో ఉండాలని సూచించారు. కాగా చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ ఫ్లోర్ లీడర్ తోట నరసింహన్ లోక్ సభ స్పీకర్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
ఏపీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. టీడీపీతో సంబంధాలు చెడిపోయిన నేపథ్యంలో బీజేపీ కొత్త మిత్రుల వేటలో పడింది. ఈ క్రమంలో వైసీపీని దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలెట్టిందనే పుకార్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో వైసీపీ కూడా కమలనాథులతో దోస్తీ చేసేందుకు అడుగులు వేస్తున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. తాజా పరిణామాలు కూడా ఈ ఊహాగాలకు బలనిచ్చేవిధంగా ఉన్నాయి.
ఎన్డీయే కూటమితో దాదాపు సంబంధాలు తెంచుకున్న చంద్రబాబు..ఇప్పుడు జాతీయ స్థాయిలో మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. తమ మద్దతిచ్చే వారి విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాతే చంద్రబాబు ఎన్డీయే కూటమితో తెగదెంపులు చేసుకుంటారని రాజకీయావర్గాల నుంచి సమాచారం.
కేసీఆరే చంద్రబాబుకు దిక్కు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సభ్యులను ఉద్దేశించిన సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించారు. ఇదే సమయంలో టీడీపీపై బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఏమన్నారంటే ..విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చమని మాత్రమే కేంద్రాన్ని కోరుతున్నాం తప్ప అదనంగా ఏమీ అడగడం లేదన్నారు. మిత్రధర్మం వల్లే ఇనాళ్లు ఓపిక పట్టాం లేదంటే పరిస్థితి మరోరకంగా ఉండేదని కేంద్రంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధే తన తొలి ప్రాధాన్యమన్నారు.
ప్రత్యేక హోదా అంశం ఢిల్లీ రాజకీయలను ప్రభావితం చేసే దిశగా కదులుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపై పోరుబాట పట్టాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ, వైపీపీ, కాంగ్రెస్ ఎంపీలు తమదైన శైలిలో నిరసనలు తెలుపుతున్నాయి. ఈ ఉదయం టీడీపీ ఎంపీలు గాంధీ విగ్రహం ముందు నిలబడి ప్లకార్డులు పట్టుకుని ఏపీకి తక్షణం ప్రత్యేక హోదాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిన్న హోదా అంశంపై ఢిల్లీలో మహాధర్నా చేపట్టిన వైసీపీ రెండో రోజు కూడా తమ ఆందోళనను కొనసాగిస్తోంది. మరోవైపు ఆంధ్రుల ఆత్మ గౌరవ దీక్ష పేరుతో మూడు రోజుల పాటు దీక్షలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఈ రోజు రాయలసీమకు 'సంబంధించిన డిక్లరేషన్ ను ప్రకటిచింది. కర్నూలు వేదికగా జరిగిన సమావేశంలో ఈ మేరకు డిక్లరేషన్ విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా సీమలో రెండో రాజధాని ఏర్పాటు , హైకోర్టు నిర్మాణం డిమాండ్లు ఉన్నాయి. రాయలసీమకు సంబంధించిన బీజేపీ డిక్లరేషన్ ను ఒక్కసారి పరిశీలిద్దాం
అనంతపురం పర్యటనలో ఉన్న చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం కియా కార్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. కేంద్రం సకాలంలో నిధులు ఇచ్చి ఉంటే తాము మరింత అభివృద్ధి చెందేవాళ్లమన్నారు. ఏపీ రావాల్సిన నిధుల కోసం ఢిల్లీ చుట్టూ ఇప్పటి వరకు 29 సార్లు తిరిగానన్నారు. అందరితో సమాన స్థాయికి వెళ్లే వరకు రాష్ట్రానికి కేంద్రం సాయం చేయాల్సిందేనని.. ఏపీకి దక్కాల్సినవన్నీ ఇచ్చే వరకు తాము కేంద్రానికి గట్టిగా నిలదీస్తామన్నారు.
జగన్ పాదయాత్రకు తొలి అడ్డంకి ఎదురైంది. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం అగ్రహానికి చేరుకున్న జగన్ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎస్సీ వర్గీకరణకు జగన్ మద్దతు ఇచ్చే వరకు పాదయాత్ర చేయడానికి వీల్లేదంటూ జగన్ ను అడ్డుకున్నారు. జగన్ నోటి నుంచి స్పష్టమైన వైఖరి తెలిపే వరకు యాత్రను తాము సాగనివ్వబోమని కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు.
జగన్ సిబ్బందితో వాగ్వాదం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.