AP Rains Alert: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో రానున్న మూడ్రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Cyclone Jawad: బంగాళాఖాతంలో దిశమార్చుకున్న జవాద్ తుపాన్ ఒడిశావైపు కదులుతోంది. రేపు(డిసెంబర్ 5) మధ్యాహ్నానికి పూరీకి సమీపంలో వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
Jawad Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉంది. ఏపీ తీరంవైపుకు దూసుకొస్తున్న వాయగుండం తుపానుగా మారనుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది.
తమిళనాడుకు భారీ వర్షాలు, వరద కష్టాలు తీరేట్ట కన్పించడం లేదు. వరద ముప్పులో చిక్కుకున్న తమిళనాడుకు మరో ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు ఆందోళన రేపుతున్నాయి.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఫలితంగా దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
Ap Heavy Rains Effect: ఓ వైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరోవైపు ఈశాన్య రుతుపవనాలు. వెరసి భారీ వర్షాలతో రాయలసీమ జిల్లాలు తల్లడిల్లాయి. భారీ వర్షాలతో మృతుల సంఖ్య 24కు చేరుకుంది.
Heavy Rain Alert: Telangana districts to be hit owing to depression in Bay of Bengal : అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణలోకి కింది స్థాయి గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. దీంతో గురువారం రాత్రి, శుక్రవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైను మరోసారి భారీ వర్షాలు వణికించనున్నాయి. రానున్న రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. ఫలితంగా చెన్నైలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
Rains Alert: రాగల మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు ఏపీ తీరాన్ని తాకనుంది.
Tamilnadu: తమిళనాడుకు మరోసారి హెచ్చరిక జారీ అయింది. మరో నాలుగురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలతో విలవిల్లాడిన చెన్నైకు తాజా హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి.
Jawad Cylone Update: ఆంధ్రప్రదేశ్‌ను తుపాను వెంటాడుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడి..తుపానుగా మారనుంది. ఈ నెల 18వ తేదీ నాటికి తుపానుగా మారననుందనే హెచ్చరికలు జారీ అవుతున్నాయి.
Cyclone Jawad Over Bay Of Bengal Around November 13 : అండమాన్ సముద్రంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది బంగాళాఖాతంలోకి ప్రవేశించి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా తుపానుగా మారనుందనే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఫలితంగా ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి.
Bay of Bengal: అటు తమిళనాడు ఇటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. తమిళనాడులో ఇప్పటికే భారీ వర్షాలు దంచెత్తుతుండగా రానున్న 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకోనున్న ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తాపై తీవ్ర ప్రభావం పడనుంది. నాలుగు రోజులపాటు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. సముద్రతీర ప్రాంతాల్లో అలలు ఎగసిపడుతున్నాయి.
Chennai floods: భారీ వర్షాలతో చెన్నై నగరం వణికిపోతోంది. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుని దిగువకు ప్రవహిస్తున్నాయి. చెన్నైలోని లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చెన్నైకు ఎవరూ రావద్దనే హెచ్చరికలు జారీ అయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.