Ap Heavy Rains Effect: ఓ వైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరోవైపు ఈశాన్య రుతుపవనాలు. వెరసి భారీ వర్షాలతో రాయలసీమ జిల్లాలు తల్లడిల్లాయి. భారీ వర్షాలతో మృతుల సంఖ్య 24కు చేరుకుంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా రాయలసీమ జిల్లాల్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో(Heavy Rains)చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో పెను విపత్తు ఏర్పడింది. భారీ వర్షాలకు పెన్నాతో పాటు ఉపనదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో ఆనకట్టలు తెగిపోయాయి. గ్రామాల్లోకి ఒక్కసారిగా వరద నీరు పోటెత్తింది. జలప్రళయంతో గ్రామాలకు మధ్య సంబంధాలు తెగిపోయాయి.
బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన వాయుగుండం తమిళనాడు, ఏపీ సరిహద్దుల్లో తీరం దాటనుందని హెచ్చరించినప్పటి నుంచి అంటే నవంబర్ 17 నుంచే భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. తిరుమల, తిరుపతిలో ఎన్నడూ లేనంతగా 20 సెంటీమీటర్ల వర్షపాతంతో లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. వాగులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తూ..లోతట్టు ప్రాంతాలపై విరుచుకుపడ్డాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 6.33 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టమేర్పడింది. ప్రాణ, ఆస్థి నష్టం భారీగా ఎదురైంది. ఇప్పటి వరకూ భారీ వర్షాల కారణంగా ఏపీలో 24 మంది మృతి(Toll Raises to 24) చెందినట్టు తెలుస్తోంది. మరో 17 మంది గల్లంతయ్యారు. చిత్తురు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ఇప్పటికీ చాలా గ్రామాలు నీటి ముంపులోనే ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా పెద్దఎత్తున రోడ్లు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో 21 వందల కిలోమీటర్ల మేర రహదారులు కోతకు గురి కాగా..1533 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. శాశ్వత మరమ్మత్తులకు 950 కోట్లు అవసరమని అంచనా.
Also read: కడప జిల్లాలో కొనసాగుతున్న వరద బీభత్సం... కుప్పకూలిన పాపాగ్ని నది బ్రిడ్జి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook