Telangana Deksha Diwas: దీక్షా దివస్ సంబురాలకు బీఆర్ఎస్ రెడీ..

Telangana Deksha Diwas: 2009లో కేసీఆర్ దీక్ష తర్వాత తెలంగాణలో మారిన రాజకీయ  పరిణామాల నేపథ్యంలో  అప్పటి కేంద్రంలోని యూపీఏ సర్కార్.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణలో సంబురాలు అంబాన్ని అంటాయి. అంతేకాదు కేసీఆర్ ఇమేజ్ తెలంగాణ సమాజంలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వాసులకు నవంబర్ 29 ప్రత్యేకం అని చెప్పాలి.

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 29, 2024, 10:12 AM IST
Telangana Deksha Diwas: దీక్షా దివస్ సంబురాలకు బీఆర్ఎస్ రెడీ..

Telangana Deksha Diwas:తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నవంబర్‌ 29 న బీఆర్‌ఎస్‌ దీక్షా దివస్‌గా పాటిస్తోంది. గత  14 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇక నేటితో  కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు దిగి 15 ఏళ్ళు పూర్తి కావొస్తోంది.  ఈ సందర్భంగా నేడు దీక్షా దివస్‌ను BRS పెద్ద ఎత్తున ప్లాన్‌ చేస్తోంది.ఈ క్రమంలో  అలుగునూరులో జరుగుతున్న దీక్షా దివస్‌ కార్యక్రమంలో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  కేటీఆర్ పాల్గొంటారు. మరో వైపు సిద్దిపేట దీక్షా దివస్‌లో పార్టీ సీనియర్‌ నేత హరీష్‌రావు హాజరుకానున్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు దీక్షా దివస్ ఉత్సవాలకు రెడీ అవుతున్నారు.

2004లో  అప్పటి కాంగ్రెస్ తమ ఉమ్మడి మేనిఫెస్టో లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీంతో అప్పటి టీఆర్ఎస్.. కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో  పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో దిగింది. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకా.. తెలంగాణ వాదాన్ని అణదొక్కాలని చూసారు. దీంతో అప్పటి వైయస్ఆర్ వైఖరికి నిరసన  అప్పట్లో కేంద్రంలో, రాష్ట్రంలోని ప్రభుత్వాల నుంచి టీఆర్ఎస్ వైదొలగింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్, తెలుగు దేశం, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పొట్టుకొని బరిలో దిగింది. కానీ ఆ ఎన్నికల్లో చిరంజీవి ప్రజా రాజ్యం మూలంగా మహా కూటమికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. మరోసారి వైయస్ఆర్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసారు. ఆ తర్వాత రోషయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

రోషయ్య ముఖ్యమంత్రి అయ్యాకా.. కేసీఆర్.. రాజకీయంగా తన పావులు కదిపారు. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు అప్పటి హోం మంత్రి చిదంబరం ప్రకటన చేశారు. ఆ తర్వాత ఏపీలో నిరసనలు వ్యక్తం కావడంతో  డిసెంబర్ 23న  ఈ ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నోరాజకీయ పరిణామాల తర్వాత 2014 చివరి సెషన్స్ లో కాంగ్రెస్ పార్టీ .. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తూ బిల్లు ప్రవేశపెట్టింది. అప్పటి ప్రతిపక్షమైన బీజేపీ బేషరతుగా మద్దతు తెలిపింది. దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం అయింది. ఆ తర్వాత తెలంగాణ జరిగిన ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కు  ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన సంగతి తెలిసిందే కదా.

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News