తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి మార్పు ఉండకపోవచ్చని అన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బండి సంజయ్‌తో తనకు విభేదాలు లేవని స్పష్టం చేశారు. పదవి ఇవ్వకున్నా పార్టీ ఆదేశాల మేరకు తాను పనిచేస్తానని చెప్పారు.
మిత్రపక్షాలను కూడగట్టేందుకు దేశ వ్యాప్త పర్యటనలు చేస్తున్న అమిత్ షా ఇప్పుడు బీహార్ లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం బీహార్ సీఎం నితీష్ కుమార్ తో అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2019 ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. జేడీయూ, బీజేపీల మధ్య సంబంధాలు కొంచెం బలహీనమయ్యాయనే వార్తలు వస్తున్న తరుణంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
సుబ్రమణ్యస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందుత్వమే బీజేపీకి బలమని.. అభివృద్ధి నినాదం కన్నా..హిందుత్వమే నినాదమే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తుందని స్వామి అభిప్రాయపడ్డారు. గతంలో ' భారత్ వెలిగిపోతోంది' నినాదంతో ఎన్నికల బరిలోకి దిగి బీజేపీ ఓటమి పాలైందని..2014 ఎన్నికల్లో హిందుత్వ నినాదం పార్టీని గెలిపించిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ స్వామి తన వాదనను సమర్ధించుకున్నారు.
ప్రత్యేక హోదాపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తనదైనశైలిలో స్పందించారు. నెల్లూరు పర్యటనలో ఉన్న ఆయన కావలిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయమన్నారు. విభజన హామీలకు సంబంధించి సుప్రీంకోర్టులో కేంద్ర ఆర్థిక శాఖ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిందని... ఈ అఫిడవిట్ లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం మరోసారి స్పష్టం చేసిందన్నారు.
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజు ఢిల్లీ పెద్దలను కలిశారు. ఏపీలో పార్టీ బలోపేతం చేసే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన విషయాలు అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకెళ్లారు... కాగా అమిత్ షాతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.