Perni Nani Meets Manchu Family: మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహానికి హైదరాబాద్‌కు వచ్చిన మంత్రి పేర్ని నాని.. మంచు ఫ్యామిలీని ప్రత్యేకంగా కలిశారు. పలు విషయాలపై వీరి మధ్య చర్చ సాగింది.
Botsa Satyanarayana counter attack to hero Nani: ఏపీలో సినిమా టికెట్ల ధరలపై హీరో నాని చేసిన వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ తప్పు పట్టారు. టికెట్ల ధరలను నియంత్రిస్తే ప్రేక్షకులను అవమానించడమెలా అవుతుందని ప్రశ్నించారు.
Ysr congress party victory: మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం సాధించింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడుచుపెట్టుకుపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయి విజయం సాధించిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
Privilege notices : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై ప్రభుత్వం కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. మంత్రులు బొత్స, పెద్దిరెడ్డిలు నిమ్మగడ్డపై సభా ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. నిమ్మగడ్డ పరిధి దాటుతున్నారనేది నోటీసుల సారాంశం..
ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు మాజీ సీఎం చంద్రబాబు, ఆయన పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని Botsa Satyanarayana విమర్శించారు. ఫ్లాప్ అయిన సినిమాకు వంద రోజుల ఫంక్షన్, సక్సెట్ మీట్ ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు, టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
వైఎస్సార్ సీపీ కీలకనేత, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తల్లి బొత్స ఈశ్వరమ్మ (Botsa Satyanarayana Mother Passes Away) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు.
కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కారణంగా నిలిచిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వచ్చేనెల చివరి నాటికి గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు ( Grama/Ward Sachivalayam Recruitment) పూర్తిచేయనున్నట్లు బుధవారం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh )లో జూలై 8న పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం వాయిదాపడింది. వైఎస్ఆర్ జయంతి నాడు పట్టాలను పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం ( AP govt ) భావించింది. అయితే రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో దీనిని వాయిదా వేసింది.
ఏపీకి మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ సభలో నిరసనలకు దిగిన 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్క రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు సోమవారం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. నేడు మంగళవారం జరిగే సమావేశాల్లో ఆ 17 మంది
టీడీపీ సభ్యులకు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి వీల్లేదు.
ఏపీకి 3 రాజధానుల బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సోమవారం ఈ బిల్లుపై సుధీర్ఘ చర్చ జరిగిన అనంతరం టీడీపీ ఎమ్మెల్యేల నిరసనల మధ్యే ఈ బిల్లు ఆమోదం పొందింది. ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానుల ఆవశ్యకతపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివరణాత్మక ప్రసంగం ఇచ్చిన తర్వాత సభలో అధిక సంఖ్యలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఈ బిల్లుకు తమ ఆమోదం తెలిపారు. బిల్లుకు భారీ మెజార్టీతో మద్దతు లభించడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.