Coronavirus Symptoms In Telugu | గతంలో కరోనా బాధితులకు జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వాసన మరియు రుచి గుర్తించలేకపోవడం, శ్వాస సంబంధిత సమస్య వంటి లక్షణాలు ఉండేవని వైద్యులు తెలిపారు.
CoronaVirus Cases In India: ఒక్కరోజు లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రజలతో పాటు ప్రభుత్వాలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందుకు కారణాలను విశ్లేషించింది.
Vaccine for COVID-19 : న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఇండియాలో కోవిడ్-19కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కరోనావైరస్పై ( Coronavirus ) కేంద్రం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయీ సంఘానికి శాస్త్రవేత్తల బృందం తెలిపింది.
Rajasthan Covid-19: కరోనావైరస్ సంక్షోభం ( Corona Pandemic ) సమయంలో పాఠశాలలు మూతబడిన విషయం తెలిసిందే. ఆన్లైన్ పాఠాలకు ( Online Classes ) కూడా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం లేదు. అయితే విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో అనేక పాఠశాలలు ఏదో విధంగా ఫీజులు వసూలు చేయడం మొదలు పెట్టాయి. దీనిపై రాజస్థాన్ ప్రభుత్వం (Rajasthan ) ఒక అదేశాలు జారీ చేసింది.
COVID-19 cases in India: న్యూ ఢిల్లీ: భారతదేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో గతంలో ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షల మార్క్ దాటేసింది.
కరోనా వైరస్ కేసులలో భారత్ ఒక్కో దేశాన్ని వెనక్కి నెట్టేస్తోంది. ప్రజల అజాగ్రత్త, అధికారులు, ప్రజా ప్రతినిధులు చేతులెత్తేయడం కరోనా వైరస్‌కు కలిసొచ్చినట్లుగా కనిపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ను గజగజ వణికిస్తోంది. ప్రతిరోజూ దాదాపు పదివేల కరోనా కేసులు వందల మరణాలతో కరోనా తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న దేశాలలో భారత్ ఒకటి.
లాక్ డౌన్ 4.0 ( Lockdown4.0 ) మే 31తో ముగుస్తుండడంతో తదుపరి కార్యాచరణపై కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే లాక్డౌన్ 4.0లో ఇచ్చిన మినహాయిపులకు సంబంధించి నిర్ణయం తీసుకొనే పూర్తి అధికారాన్ని కేంద్రం రాష్ట్రాలకే అప్పగించింది.
భారత్‌లో గత 24 గంటల్లో 1,490 మందికి కరోనా వైరస్ సోకినట్టుగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో కరోనా కారణంగా 56 మంది మృతి చెందినట్టు కేంద్రం వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 24,942కి చేరగా.. మృతుల సంఖ్య 779కి చేరింది.
కరోనావైరస్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 1,553 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా సోకి 36 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. సోమవారం సాయంత్రం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ దేశంలో కరోనా లేటెస్ట్ అప్డేట్స్ని మీడియాకు వెల్లడించారు
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న 170 జిల్లాలను హాట్‌స్పాట్స్‌గా గుర్తించినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. హాట్‌స్పాట్స్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి కొత్తగా ఇంకెవరికైనా కరోనా వైరస్ సోకిందా అని తెలుసుకునేందుకు దశల వారీగా అనుమానితుల శాంపిల్స్ సేకరించి పరీక్షకు పంపిస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది.
ఇండియాలో కరోనావైరస్ విషయంలో కమ్యూనిటీ స్ప్రెడ్ జరగలేదని కేంద్రం స్పష్టంచేసింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగానే ఒకరి నుంచి మరొకరిని దూరంగా ఉండాల్సిందిగా చెబుతూ వస్తున్నట్టుగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అలాగే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఏమీ లేదని లవ్ అగర్వాల్ పిలుపునిచ్చారు.
కరోనావైరస్ (COVID-19) ఒకరి నుండి మరొకరికి వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో నగరంలోని కాలనీలు, అపార్ట్మెంట్ అసోసియేషన్స్‌కి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి (Telangana DGP Mahender Reddy) ఓ విజ్ఞప్తి చేశారు.
టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజు (Toll fee at toll gates) వసూలు చేయకపోవడం ద్వారా ప్రజలకు అత్యవసర సేవల అందించడంలో ఏర్పడుతున్న అసౌకర్యం తొలగిపోనుండటంతో పాటు క్లిష్టమైన పరిస్థితుల్లో సమయం కూడా వృథాకాకుండా ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి స్పష్టంచేశారు.
భారత్‌లో కరోనావైరస్ కాటుకు మరొకరు బలయ్యారు. గుజరాత్‌లోని అహ్మెదాబాద్‌లో కరోనావైరస్ బారినపడిన 85 ఏళ్ల వృద్ధురాలు బుధవారం రాత్రి మృతిచెందారు. ఈ వృద్ధురాలి మరణంతో భారత్‌లో కరోనావైరస్తో బాధపడుతూ మృతి చెందిన వారి సంఖ్య 12కి చేరింది.
తెలంగాణలో నేడు మరో 2 కరోనావైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో వెలుగుచూసిన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 41కి చేరింది. నేడు గుర్తించిన కరోనా పాజిటివ్ కేసుల్లో ఒక మహిళతో పాటు మూడేళ్ల బాబు సైతం ఉన్నారు.
భారత్‌లో వ్యాపిస్తున్న కరోనావైరస్కి ప్రధాన కారణం విదేశీయులు.. లేదా విదేశాలకు వెళ్లొచ్చిన భారతీయులేనని పదేపదే నిరూపితమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అటువంటు ఘటనే మరొకటి చోటుచేసుకుంది.
హంటావైరస్... ఇప్పటికే కరోనావైరస్ చేస్తోన్న విలయ తాండవం సరిపోదన్నట్టుగా కొత్తగా మళ్లీ ఇదేం వైరస్ అని అనుకుంటున్నారా ? అయితే దీని గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిందే. కరోనావైరస్ పుట్టిన చైనాలోనే ఈ వైరస్ కూడా పుట్టింది.
టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ నగదు ఎలా అని కంగారు చెందాల్సిన పనిలేదంటూ ఐఆర్సీటీసీ శుభవార్త చెప్పింది. ఆన్ లైన్లో బుక్ చేసుకున్న టికెట్లను క్యాన్సిల్ చేసుకోకుండానే పూర్తి నగదు ప్రయాణికులకు అందిస్తామని ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.