Pfizer COVID-19 Vaccine : ఇదివరకే కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు ఇస్తుండగా, ఇటీవల స్పుత్నిక్ వి వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తాజాగా డీఆర్డీవో రూపొందించిన 2డీజీ డ్రగ్ మార్కెట్లోకి విడుదల కానుంది. వచ్చే వారం నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒకప్పటితో పోల్చుకుంటే ఇటీవల కాలంలో భారీగా తగ్గుముఖం పట్టాయి. ఆందోళనకర పరిస్థితులు నుంచి హమ్మయ్య ఇక ఏం కాదులే అనే స్థితికి ఢిల్లీ ఇప్పుడిప్పుడే చేరుకుంటోంది. అయితే, ఇదే క్రమంలో గత ఆదివారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో లాక్‌డౌన్‌ను (Delhi lockdown) మే 31 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 91,048 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా (covid-19 tests) వారిలో కొత్తగా 3,762 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
Corona Vaccine Affect: కరోనా వ్యాక్సిన్ తొలి టీకా తీసుకున్నవారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లను సైతం ఎదుర్కొనేలా మీ శరీరం సిద్ధమవుతుందని సీడీపీ తన రిపోర్టులో పేర్కొంది. కోవిడ్19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిని పరిశీలిస్తే ఇన్ఫెక్షన్ సోకే అవకాశం వీరికి 0.01 శాతం ఉంటుందని శుభవార్త అందించింది.
కామెడీ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతున్న ముగ్గురు మొనగాళ్లు మూవీ ట్రైలర్ (Mugguru Monagallu Trailer) తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. కామెడీ చిత్రాలకు పెట్టింది పేరైన కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో ఈ ముగ్గురు కలిసి మంచి కామెడీ పండించినట్టు ముగ్గురు మొనగాళ్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
అలోపతిక్ మెడిసిన్‌పై యోగా గురు రాందేవ్ బాబా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉత్తరాఖండ్ బ్రాంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అంతేకాకుండా రాందేవ్‌పై రూ. 1000 కోట్ల పరువు నష్టం దావా వేస్తూ (IMA Uttarakhand slaps defamation notice on Ramdev) నోటీసులు కూడా పంపించింది
తొలుత సెప్టెంబర్ 15 నుంచి ఐపీఎల్ సీజన్ 14 మిగతా మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసఐ, ఐపీఎల్ పెద్దలు భావించారు. కానీ ఆ సమయానికి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ షెడ్యూల్ పూర్తికాదన్న కారణంగా మూడో వారంలో ఐపీఎల్ 2021 మిగతా సీజన్ ప్రారంభించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉందని ఓ అధికారి వెల్లడించారు.
చెన్నై: తమిళనాడులో కరోనా ఉధృతి తారా స్థాయిలో ఉంది. మంగళవారం తమిళనాడు సర్కారు (Tamilnadu govt) విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఆ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 34,285 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా అదే సమయంలో 468 మంది కరోనాతో కన్నుమూశారు. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి 24 గంటల వ్యవధిలో ఇంత భారీ సంఖ్యలో కరోనా రోగులు చనిపోవడం ఇదే తొలిసారి.
హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 3,821 కరోనా పాజిటివ్ కేసులు (Covid-19 cases) నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య మొత్తం 5,60,141 కి చేరింది.
Covid-19 Vaccination For Super Spreaders : తెలంగాణలో కరోనా పాజిటివిటి రేటుతో పాటు పాజిటివ్ కేసులు, మరణాలు స్వల్పంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కరోనా టీకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
KKR Player Tim Seifert | ఐపీఎల్ 2021 భారత్‌లో నిర్వహించడం తప్పిదమని, సరైన నిర్ణయం కాదని సీజన్ మధ్యలోనే నిలిచిపోవడం తెలియజేస్తుంది. ఈ క్రమంలో ఐపీఎల్ వాయిదా పడిన వెంటనే భారత క్రికెటర్లు, దేశవాలీ ఆటగాళ్లు వెంటనే తమ ఇళ్లకు చేరుకున్నారు.
Jr NTR Recovered From Covid-19 | ఇటీవల టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా మహమ్మారిని జయించాడు. తాజాగా ఈ జాబితాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేరిపోయాడు. తాను కరోనా బారి నుంచి కోలుకున్నానంటూ నందమూరి అభిమానులకు, టాలీవుడ్ ప్రేక్షకులకు శుభవార్త చెప్పాడు.
కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వశాఖ కేంద్ర ప్రభుత్వ కార్మికులకు వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్ (Dearness Allowance) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నెలకు రూ.105 ఉన్న డీఏను రెట్టింపు చేసి రూ.210కి పెంచారు. ఏప్రిల్ 1, 2021 నుంచి పెంచిన వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్ అమలులోకి రానుంది. దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు కార్మికులకు కనిష్ట వేతనాన్ని పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి.
India Corona Cases : దేశవ్యాప్తంగా తాజాగా 2 లక్షల దిగువకు పాజిటివ్ కేసులు దిగిరావడం భారీగా ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటలలో కోవిడ్19 మరణాలు సైతం నిన్నటితో పోల్చితే తగ్గాయి. దేశ వ్యాప్తంగా మరో 3,511 మందిని కోవిడ్19 మహమ్మారి బలిగొంది.
Lockdown, COVID-19, black fungus, vaccination in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనాను కట్టడి చేసేందుకు ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, మరోవైపు కరోనా పరీక్షలను పెంచడం ద్వారా కరోనాను కట్టడి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడి, బ్లాక్ ఫంగస్, కొవిడ్-19 వాక్సిన్, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
BCCI to donate 2000 oxygen concentrators: న్యూ ఢిల్లీ: కరోనాపై పోరులో యుద్ధం చేస్తోన్న మన దేశానికి మరోసారి తమ వంతు సహకారం అందించేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది. అందులో భాగంగానే 2000 ఆక్సీజన్ కాన్సంట్రేటర్స్ సమకూర్చనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.
Telangana COVID-19 cases latest updates: హైదరాబాద్: తెలంగాణలో శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గడచిన 24 గంటల్లో 63,120 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 3,308 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,51,035 మందికి చేరుకుంది.
AstraZeneca COVID-19 Vaccine: కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెంది గత ఏడాదితో పోల్చితే కోవిడ్19 మరణాలు అధికంగా సంభవించాయి. దానికితోడు ఇటీవల బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అని కొత్త సమస్యలు వైద్య రంగానికి సరికొత్త సవాల్‌గా మారుతున్నాయి.
India Corona Deaths | గత వారం రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ, కోవిడ్19 మరణాలు 4 వేలకు పైగా నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. దేశంలో కరోనా మరణాలు 3 లక్షలు దాటిపోయాయి. కరోనా పాజిటివ్ కేసులో ఓవైపు తగ్గుతుంటే, మరోవైపు బ్లాక్ ఫంగస్ సమస్య సవాల్‌గా మారుతుంది.
P Som Shekar Dies: రామ్ గోపాల్ వర్మ సినిమాలకు సోమశేఖర్ పనిచేశారు. రంగీలా, దౌడ్, సత్య సినిమాలకు సోమశేఖర్ ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వర్తించారు. బాలీవుడ్లో ముస్కురాకే దేఖ్ జరా అనే సినిమాకు దర్శకత్వం వహించారు. సోమశేఖర్ కుటుంబానికి బాలీవుడ్ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.