Granules india to supply 16 cr Paracetamol 500 mg tablets: హైదరాబాద్: కరోనాపై పోరులో తమ వంతు కృషిగా తెలంగాణ ప్రభుత్వానికి 16 కోట్ల పారాసిటమోల్ ట్యాబ్లెట్స్ ఉచితంగా అందివ్వనున్నట్టు పారాసిటమోల్ ట్యాబ్లెట్ల తయారీలో పేరున్న ఫార్మాసుటికల్ కంపెనీ అయిన గ్రాన్యుయెల్స్ ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. ఈ ట్యాబ్లెట్స్ విలువ 8 కోట్లు ఉంటుందని కంపెనీ పేర్కొంది.
Banks timings during lockdown in Telangana: హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో అటు బ్యాంకుల సిబ్బంది, ఇటు ఖాతాదారులను దృష్టిలో పెట్టుకుని బ్యాంకుల పనివేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి.
కొందరు వారం రోజులకే కోవిడ్19 నుంచి కోలుకుంటే, మరికొందరికి రెండు వారాలు, ఇంకొందరు నెలకు పైగా రోజులు చికిత్స అనంతరం కోలుకుంటున్నారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Allu Arjun Tests Negative For Covid-19 : గత రెండు వారాలుగా కరోనాతో పోరాటం చేసిన అల్లు అర్జున్ కరోనాను జియించాడు. రెండు వారాల చికిత్స, హోం ఐసోలేషన్ అనంతరం తాను కోవిడ్19 నుంచి కోలుకున్నానని తెలిపాడు. అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ ట్వీట్ చేశాడు.
India COVID-19 Cases: పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ, పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తుండటంతో రెండు రోజులపాటు తగ్గినట్లే కనిపించిన కరోనా కేసులు నేడు పెరిగాయి. భారత్‌లో ఒక్క రోజు వ్యవధిలో కరోనా మరణాలు నమోదు కావడం ఇదే అత్యధికం.
Team India Players Taking COVISHIELD Vaccine: టీమిండియా క్రికెటర్లు ఒక్కొక్కరుగా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. క్రికెట్ అభిమానులు సైతం కోవిడ్-19 టీకాలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే భారత క్రికెటర్లు ఒకే రకం టీకాలు తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు టీమిండియా ఆటగాళ్లు వరల్డ్ టెస్టు ఛాంపియన్ కోసం సన్నద్ధమవుతున్నారు.
YS Sharmila slams Telangana CM KCR: హైదరాబాద్: కరోనాను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చకపోవడాన్ని తప్పుపడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ ద్వారా సీఎం కేసీఆర్‌పై పలు వ్యంగ్యాస్త్రాలు సంధించిన వైఎస్ షర్మిల.. ''అయ్య పెట్టడు అడుక్కు తిననియ్యడు. KCR కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడు.. కేంద్ర ఆయుష్మాన్ భారత్‌లో చేరరు'' అంటూ ముఖ్యమంత్రిపై సెటైర్లు వేశారు.
Indian Railway Employees | విధంగా కరోనా వైరస్ పరివర్తనం చెంది రూపాంతరం చెందడంతో కరోనా సెకండ్ వేవ్‌లో భారీగా కేసులు పెరగడంతో పాటు కరోనా మరణాలు నమదవుతున్నాయి. దేశంలో అత్యధిక ఉద్యోగులు ఉన్న సంస్థ రైల్వే శాఖలో కరోనా తీవ్రత అధికమైందని అధికారులు చెబుతున్నారు.
Corona Second Wave: కరోనా లక్షణాలు సైతం భారీగా మారాయి. తొలి వేవ్‌లో పొడి దగ్గు, వాసన మరియు రుచిని కోల్పోవడం, జ్వరం, తలనొప్పి లాంటి లక్షణాలు కనిపించేవి. ఫస్ట్ వేవ్‌తో పోల్చితే కరోనా కేసులు మూడింతలు పెరిగాయి. కోవిడ్19 మరణాలు సైతం భారీగా నమోదయ్యాయి.
India Corona Positive Cases : దేశ వ్యాప్తంగా సగానికి పైగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ, పాక్షిక కర్ఫ్యూ అమలవుతోంది. లాక్డౌన్, నైట్ కర్ఫ్యూలు ఫలితాన్ని్స్తున్నాయి. దేశంలో వరుసగా రెండో రోజు కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.
COVID-19 cases in Telangana: హైదరాబాద్ : తెలంగాణలో గత 24 గంటల్లో 65,923 శాంపిళ్లను పరీక్షించగా వాటిలో కొత్తగా 4,826 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనాతో రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది మృతి చెందారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన లేటెస్ట్ హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల వ్యవధిలో 7,754 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు.
Telangana lockdown updates: హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తే తప్ప కరోనా పాజిటివ్ కేసులు అదుపులోకి రావనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు సైతం ఈ అంశంపై ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం రానే వచ్చింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రేపు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది.
TS Medical staff recruitment notification:హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో కరోనా రోగుల తాకిడిని తట్టుకోలేక ఆస్పత్రులు సైతం చేతులెత్తేసే పరిస్థితి తలెత్తింది. కరోనా రోగులకు తగినంత ఆక్సీజన్ నిల్వలు, రెమ్డిసివిర్ ఇంజెక్షన్స్ (Remdesivir injection) లేకపోవడం అందుకు ఓ కారణమైతే.. అసలు రోగుల సంఖ్యకు సరిపడే స్థాయిలో వైద్య సిబ్బంది లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది.
Free COVID-19 vaccine registration: కరోనాను కట్టడి చేయడం కోసం తొలుత 45 ఏళ్లకుపైబడిన వారికి మాత్రమే కొవిడ్-19 వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించిన కేంద్రం ఆ తర్వాత మే 1 నుంచి 18 ఏళ్లకు (18+ age group) పైబడిన వారికి కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు అనుమతించింది. దీంతో అప్పటికే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం వేచిచూస్తున్న వారు భారీ సంఖ్యలో ఉండగా.. ఆ తర్వాత ఆ సంఖ్య మరింత రెట్టింపయ్యింది.
టీమిండియా క్రికెటర్ల ఇళ్లల్లో కరోనా మహమ్మారి విషాదాన్ని నింపుతోంది. ఇటీవల మహిళా క్రికెటర్ వేద క్రిష్ణమూర్తి తల్లి, సోదరి మరణం, మరియు నిన్న రాజస్తాన్ రాయల్స్ యువ పేసర్ చేతన్ సకారియా తండ్రి మరణవార్తను మరిచిపోయేలోపే మరో విషాదం చోటుచేసుకుంది. టీమిండియా క్రికెటర్ పియూష్ చావ్లా ఇంట్లో కరోనా మహమ్మారి పెను విషాదాన్ని మిగిల్చింది.
ICMR On Black Fungus: COVID-19 బాధితులలో Mucormycosis అనే అనే నల్లటి ఫంగల్ ఇన్ఫెక్షన్ గుర్తించారు. తొలి దశలోనే దీన్ని గుర్తించకపోతే కంటి చూపు పోతుందని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు ICMR కరోనా పేషెంట్లలో ఈ వ్యాధిని పరీక్షించాలని చెబుతున్నాయి.
India COVID-19 Cases: భారత్‌లో నాలుగు రోజుల తరువాత 4 లక్షల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా సగానికి పైగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ, పాక్షిక కర్ఫ్యూ అమలవుతోంది. పలు రాష్ట్రాలు 2 వారాలపాటు లాక్డౌన్ విధించాయి.
COVID-19 Lockdown In India: ప్రతిరోజూ 4 లక్షలకు పైగా కరోనా కేసులు, ఇటీవల కరోనా మరణాలు సైతం 4 వేలు దాటుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్‌డౌన్‌ను తమ అస్త్రంగా చేసుకున్నాయి. ప్రాణ నష్టాన్ని నివారించడం, వైరస్‌పై విజయం సాధించడానికి లాక్డౌన్ విధిస్తున్నారు.
RR Pacer Chetan Sakariya | డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి చెందిన అధికారులు జాతీయ మీడియా ఏఎన్ఐకి తెలిపారు. రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన పేసర్ చేతన్ సకారియా ఇంట్లో విషాదం నెలకొంది.
Koppula Eshwar Tests Positives For Covid-19: ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు. తాజాగా మరో మంత్రికి కరోనా సోకింది. తెలంగాణ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన కరోనా టెస్టులు చేయించుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.