Black fungus cases in AP : అమరావతి: బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకొస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారమే సంబంధిత ఉన్నతాధికారుల నుంచి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టుకు ఉత్తర్వులు వెలువడినట్టు తెలుస్తోంది.
COVID-19 cases in AP: అమరావతి: ఏపీలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 1,01,330 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 23,160 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అందులో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 3528, చిత్తూరు జిల్లాలో 2670, అనంతపురం జిల్లాలో 2334, విశాఖపట్నం జిల్లాలో 2007, పశ్చిమ గోదావరి జిల్లాలో 1879 కేసులు వెలుగు చూశాయి.
Twin brothers dies of COVID-19: కరోనావైరస్ సెకండ్ వేవ్ ఎంతో మందికి అయినవాళ్లను దూరం చేస్తోంది. ఎన్నో ఇళ్లలో ఏదో ఓ రూపంలో అశాంతిని నింపుతోంది. తాజాగా ఓ కుటుంబంలో ఇద్దరు కవల సోదరులను కొన్ని గంటల వ్యవధిలోనే పొట్టనపెట్టుకుంది ఈ కరోనా. కలిసే పుట్టారు.. కలిసే పెరిగారు.. కలిసే చదువుకున్నారు.. చివరకు చావులోనూ ఈ లోకంలోంచి కలిసే వెళ్లిపోయారు.
Jr NTR Birthday Celebrations | ఇదివరకే ఆన్లైన్లో జైఎన్టీఆర్ అని ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు విన్నపం చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో అభిమానులకు విన్నపం అంటూ ఓ లేఖ విడుదల చేశారు.
Remdesivir Injection : కరోనా పేషెంట్లపై రెమిడెసివర్ ప్రభావం చూపుతున్నట్లుగా కనిపించడం లేదని, త్వరలో కోవిడ్19 చికిత్సలో భాగంగా ఈ ఇంజక్షన్‌ను తొలగించనున్నారని గంగా రామ్ ఆసుపత్రి చైర్పర్సన్ డాక్టర్ డీఎస్ రాణా అభిప్రాయపడ్డారు.
India Reports Record Deaths Of COVID-19 | కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్‌డౌక్, కర్ఫూ అమలు చేస్తున్నా కరోనా మరణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దేశంలో ఒక్కరోజులో నమోదైన కరోనా మరణాలలో ఇదే అత్యధికం.
SII CEO Adar Poonawalla : తమకు భారత ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, వారి శ్రేయస్సును కాదని విదేశాలకు కోవిడ్19 వ్యాక్సిన్ ఎగుమతి చేయడానికి ప్రయత్నించలేదన్నారు. జనాభాలో భారత్ రెండో అతిపెద్ద దేశమని, కేవలం రెండు మూడు నెలల్లో దేశ ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.
Lockdown timings in AP: అమరావతి: ఏపీలో లాక్డౌన్ టైమింగ్స్‌లో మార్పులు చేసినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఏపీ సర్కారు (AP govt) స్పష్టంచేసింది.
Telangana govt to implement Ayushman Bharat Scheme: హైదరాబాద్: కేంద్రం అమలు చేస్తోన్న ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరనున్నట్లు తెలంగాణ సర్కార్ స్పష్టంచేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జాతీయ ఆరోగ్య శాఖతో ఎంవోయూ(MoU)పై సంతకాలు చేసింది.
Telangana COVID-19 cases: హైదరాబాద్: గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 3,982 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,36,766 కి చేరింది. గడిచిన 24 గంటల్లో 27 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
WTC Final In Southampton | ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా జూన్ 18వ తేదీ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ప్రారంభం కానుంది. ఇతర దేశాల ఆటగాళ్లు సైతం తొలి టెస్టు ఛాంపియన్షిప్ ఎవరు కైవసం చేసుకుంటారో చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
India COVID-19 Cases | కోవిడ్19 తీవ్రత మాత్రం రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా బ్లాక్ ఫంగస్ కేసులు వైద్యులకు సైతం తలనొప్పిగా మారాయి. కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్‌డౌక్, కర్ఫూల్ కొనసాగిస్తున్నాయి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్, 2డీజీ ఔషధాలు సైతం మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి.
COVID-19 Vaccines Effective Against Corona Variants In India: ఇటీవల రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి, డాక్టర్ రెడ్డీస్, డీఆర్డీవో సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2 డిజీ మెడిసిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం పొందాయి. తాజాగా మార్కెట్లోకి సైతం ఈ మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది.
Telangana COVID-19 latest health bulletin: హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 62,591 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 3,961 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో మరో 30 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
Cow urine will check Coronavirus: BJP MP Pragya Thakur | భోపాల్: బీజేపీ ఎంపీ ప్రగ్యా థాకూర్.. ప్రస్తుత రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. 2019 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రగ్యా థాకూర్ చేసిన పలు వ్యాఖ్యలు ఆమెకు విపరీతమైన ప్రచారం తెచ్చిపెట్టాయి. తాజాగా ఆమె మరోసారి వార్తల్లోకెక్కారు. గోమూత్రం కరోనావైరస్కు చెక్ పెడుతుందంటూ తాజాగా ప్రగ్యా థాకూర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
AP COVID-19 cases latest updates: అమరావతి: ఏపీలో నిన్నమొన్నటి పరిస్థితితో పోల్చుకుంటే తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా గుర్తించిన కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. కరోనా మృతుల సంఖ్య మాత్రం పైకే ఎగబాకుతోంది. గత 24 గంటల్లో ఏపీలో 73,749 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 18,561 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
Australian Players Returns Home From Maldives: ఆయా దేశాల ప్రభుత్వాలు విధించిన ఆంక్షలు, కరోనా నిబంధనలతో కొన్ని దేశాల ఆటగాళ్లు గత రెండు వారాలకు పైగా స్వదేశానికి చేరుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2021 సీజన్లో పాల్గొన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎట్టకేలకు తమ దేశానికి సురక్షితంగా చేరుకున్నారు.
గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి, కానీ కోవిడ్19 మరణాలు మాత్రం ఆందోళన రేకెత్తిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుతున్నా, ప్రతిరోజూ 4 వేలకు పైగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. తమిళనాడులోనూ కరోనా తీవ్రత అధికంగా ఉంది. అయితే ఇటీవల ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి కోలీవుడ్ నుంచి మద్దతు పెరుగుతోంది. నటీనటులు ఒక్కొక్కరుగా విరాళాలు అందిస్తూ కరోనాపై పోరాటంలో తమవంతు విరాళాలు అందజేస్తున్నారు.
COVID19 For Diabetes Patient | కొత్త వేరియంట్లు సైతం పుట్టుకురావడంతో కరోనా మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. అయితే మధుమేహం (Diabetes) పేషెంట్లలో కరోనా వ్యాధి మరింత ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
India Covid-19 Cases: కోవిడ్19 తీవ్రత ప్రభావం అధికంగానే ఉంది. దీనికి తోడు బ్లాక్ ఫంగస్ కేసులు రావడంతో మరణాలు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్‌డౌక్, కర్ఫూల్ కొనసాగిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.