AP Jobs 2021: వైద్యులు, వైద్య సిబ్బంది, సంబంధిత శాఖల ఉద్యోగులు, హెల్ప్ డెస్క్ సేవల అవసరం రెట్టింపు అవుతుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ హెల్ప్ డెస్క్ మేనేజర్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నామని ప్రకటించింది.
CT Scan For COVID-19 Patients | స్వల్ప లక్షణాలతో ఉన్న కరోనా బాధితులకు, అనుమానితులకు సీటీ స్కాన్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఒక్క సీటీ స్కాన్ చేయడం అంటే 300 నుంచి 400 చెస్ట్ ఎక్స్‌రే చేయడంతో సమానమని, భవిష్యత్తులో క్యాన్సర్‌కు సైతం దారి తీసే అవకాశాలున్నాయని హెచ్చరించారు.
TS Corona Bulletin | కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్నా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో తాజాగా 6,876 మంది కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం కరోనా అప్డేట్ అందించింది.
Varun Chakravarthy Health Update | కేకేఆర్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ ఆరోగ్యంపై ఫ్రాంచైజీ సీఈవో వెంకీ మైసూర్ స్పందించారు. సందీప్ వారియర్ ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉందన్నారు. అయితే వరుణ్ చక్రవర్తిలో కరోనా లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
Fainting After Corona Vaccination : అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ కింద ప్రజలకు టీకాలు అందిస్తుంది. కరోనాపై పోరుకు వ్యాక్సిన్ సైతం ఓ మార్గమని తెలిపింది. కొందరిలో మూర్ఛ, కళ్లు తిరగటం, స్వల్పంగా తలనొప్పి, అధిక శ్వాసక్రియ లాంటి లక్షణాలను గుర్తించారు.
Sabbam Hari passed away due to COVID-19: విశాఖపట్నం: టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి ఇక లేరు. ఏప్రిల్ 15వ తేదీన కరోనావైరస్ బారిన పడిన సబ్బం హరి విశాఖపట్నంలోని (Vizag) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.
Cricket Australia Donates 50,000 AUD To India : క్రికెట్ ఆస్ట్రేలియా సైతం భారతదేశానికి అండగా నిలిచింది. తనవంతుగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 50 వేల ఆస్ట్రేలియా డాలర్లు విరాళం ప్రకటించింది. ఆ నగదును యునిసెఫ్ ద్వారా భారత్‌కు అందజేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
Megastar Chiranjeevi : సామాన్యులతో పాటు పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు సైతం చికిత్స తీసుకున్నా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేను సైతం అంటూ కరోనా బాధితులకు సహాయం చేసేందుకు శ్రమిస్తున్నారు.
Complete Lockdown In India: కరోనా వైరస్ ప్రభావం గత ఏడాది కన్నా రెండు రెట్లు అధికంగా కనిపిస్తుంది. కరోనా సెకండ్ వేవ్‌లో దేశంలో 24 గంటల వ్యవధిలో దాదాపు 4 లక్షల పాజిటివ్ కేసులు దాదాపు 3500 మేర కోవిడ్19 మరణాలు సంభవిస్తుండటంతో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పందించింది.
Telangana COVID-19 Positive Cases : కరోనా టీకా మోతాదులు రానందున 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ జరగడం లేదు. రాష్ట్రంలో తాజాగా 5,695 మంది కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
SBI Alert For KYC: కోట్లాది ఖాతాదారులు నిర్ణీత గడువు ముగిసేలోగా కేవైసీ(KYC) ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఓ ప్రకటన విడుదల చేసింది. లేని పక్షంలో మీ స్టేట్ బ్యాంక్ ఖాతాలు సర్వీసులు అందించవని స్పష్టం చేసింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది.
Covid-19 Complications | కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారుతోంది. భారత్‌లో ప్రస్తుతం దాదాపుగా 4 లక్షల వరకు కరోనా కేసులు, వారంలో దాదాపు 25 వేల మరణాలు నమోదవుతున్నాయి. అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో, కొన్ని ఆరోగ్య పరిస్థితులలో ఉన్న వారిని కోవిడ్19 మహమ్మారి కబలిస్తోందని పలు అధ్యయనాలు తేల్చాయి. ఆ వివరాలు మీకోసం..
Anchor Pradeep Machiraju Father Passed Away: కరోనా మహమ్మారి గత ఏడాది నుంచి ఎంతో మంది సెలబ్రిటీల ఇళ్లల్లో విషాదాన్ని నింపింది. కోవిడ్19 మహమ్మారి తాజాగా నటుడు ప్రదీప్ ఇంట్లోనూ తీరని నష్టాన్ని మిగిల్చింది. టాలీవుడ్ నటుడు ప్రదీప్ తండ్రి పాండురంగ మాచిరాజు(65) కన్నుమూశారు.
Telangana COVID-19 Positive Cases And Deaths : ఓవైపు కరోనా వ్యాక్సినేషన్ భారీగా జరుగుతున్నా, కరోనా పాజిటివ్ కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 7,430 మంది కరోనా బారిన పడ్డారు. సెకండ్ వేవ్ ప్రభావం ఇతర రాష్ట్రాలతో సహా తెలంగాణలో అధికంగా ఉంది.
PIB Fact check on Lockdown in India: న్యూఢిల్లీ : మే 2వ తేదీన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాగానే 3వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తారని సోషల్ మీడియాలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో మరోసారి లాక్డౌన్ వస్తే తమ పరిస్థితి ఏంటని వలస కార్మికులు (Migrant workers), రోజువారీ కూలీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Fake COVID-19 test reports: న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి అనంతరం కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతుండటంతో కరోనా పరీక్షలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో కరోనా పరీక్షల కోసం వచ్చే బాధితులను లక్ష్యంగా చేసుకుని వారికి నకిలీ కొవిడ్-19 టెస్ట్ రిపోర్టులు ఇచ్చి వారిని మోసం చేయడమే పనిగా పెట్టుకున్న ఓ ముఠా తాజాగా ఢిల్లీ సౌత్ జోన్ పోలీసులకు దొరికిపోయింది.
International Passenger Flights : కరోనా వైరస్ కేసులు గత ఏడాది భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీశాయి. కానీ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్‌లో పరిస్థితి మరింత క్షీణిస్తోంది. ఏప్రిల్ 30తో ముగియనున్న అంతర్జాతీల విమానాలపై నిషేధాన్ని మే 31వరకు డీజీసీఏ పొడిగించింది.
COVID-19 Vaccine Formula: భారత్‌లో కరోనా మహమ్మారి రెండో దశలో అలజడి సృష్టిస్తోంది. ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పోరాటం చేస్తున్నాయి. అయితే భారత్ సహా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో అమెరికా కరోనా వ్యాక్సిన్ ఫార్ములాను పంచుకోకూడదని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు.
Cancer Patients COVID-19 Positive: చిన్నారుల ఆసుపత్రిలో బాధితులపై ప్రయోగాలు చేయగా, క్యాన్సర్ బారిన పడిన కొందరిలో, క్యాన్సర్‌ను జయించిన వారిలో సైతం కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కొన్ని నెలలపాటు కోవిడ్19 నిర్ధారణ పరీక్షలలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ఉంటుంది. కరోనా వ్యాక్సినేషన్ భారీగా జరుగుతున్నా, వైరస్‌లో చోటుచేసుకుంటున్న మార్పులతో తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 7,646 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,35,606కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.