India COVID-19 Cases | దేశంలో మహమ్మారి విజృంభణ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. భారత్‌లో వరుసగా నాలుగో రోజూ 4 లక్షలకు పైగా కోవిడ్19 పాజిటివ్ కేసులు కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 4 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.
Wife committed suicide as her husband died of COVID-19: ఇండోర్: కరోనావైరస్ జనంలో అనేక రకాల ఆందోళనలకు కారణం అవుతోంది. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్న కరోనా వైరస్‌ను చూసి లోకం అంటే ఏంటో తెలియని సామాన్యులు వణికిపోతున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, మగ దిక్కు కోల్పోయిన కుటుంబాలు రోడ్డునపడుతుండటం కరోనా బాధితులను ఆందోళనకు గురయ్యేలా చేస్తున్నాయి.
COVID-19 positive test reports: న్యూ ఢిల్లీ: కరోనాపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ... ''కరోనా లక్షణాలతో బాధపడే వారికి కొవిడ్ ఆస్పత్రుల్లో చేరాలంటే కరోనా పరీక్షలకు సంబంధించిన పాజిటివ్ రిపోర్ట్ అవసరం లేదు'' అని స్పష్టంచేసింది.
COVID-19 cases in Andhra Pradesh: అమరావతి: ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య భారీగా పెరుగుతోంది. గురువారం వరకు వరుసగా ఐదు రోజులపాటు 20 వేలకుపైగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు.. శుక్రవారం కాస్త తగ్గుముఖం పట్టించినట్టే కనిపించాయి. కానీ ఇంతలోనే శనివారం కొత్తగా గుర్తించిన కరోనా పాజిటివ్ కేసులు మరోసారి 20 వేల మార్కు దాటడం ఆందోళనకు గురిచేస్తోంది.
IMA calls for nation wide lockdown: న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండటంతో పాటు వైద్య సదుపాయాలు, ఆక్సీజన్ కొరత, బెడ్స్ లేక రోగులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించాల్సిన అవసరం కనిపిస్తోందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభిప్రాయపడింది. ఈ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు ఓ లేఖ రాసింది.
Curfew in Goa, rules and regulations to know: పనాజి: గోవాలో భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులకు చెక్ పెట్టేందుకు గోవా సర్కార్ మరో కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలతో కరోనా పాజిటివ్ కేసులు తగ్గడం లేదని స్పష్టంచేసిన గోవా సీఎం ప్రమోద్ సావంత్.. గోవాలో మే 9వ తేదీ ఆదివారం నుండి 15 రోజుల పాటు పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించారు.
Shikhar Dhawan Receives COVID-19 Vaccine: గత కొన్ని రోజులుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021)తో బిజీగా ఉన్న శిఖర్ ధావన్ తాజాగా కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. వ్యాక్సిన్ తీసుకున్న సందర్భంగా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు 35 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ ధన్యవాదాలు తెలిపాడు.
Telangana Corona Positive Cases: గత రెండు రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణలో తాజాగా 5,892 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,81,640కి చేరింది.
Delhi Makes Quarantine Mandatory: తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వెళ్తున్న వారిపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్తున్న వారికి ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Wear mask, take COVID-19 vaccine- RRR team: కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా కట్టడి చేయొచ్చో చెబుతూ దర్శకధీరుడు రాజమౌళి ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీలో కీలక పాత్రలు పోషిస్తోన్న రామ్ చరణ్, తారక్, ఆలియా భట్, అజయ్ దేవగన్ లతో కలిపి ఓ వీడియో సందేశం రూపొందించారు.
Sourav Ganguly on IPL 2021 Bio-Bubble Breach: అనూహ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2021) మధ్యలోనే నిలిచిపోయింది. సీజన్ మధ్యలోనే మ్యాచ్‌లు నిలిపివేసిన 14వ సెషన్ హాట్ టాపిక్ అవుతోంది. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు.
ICMR Guidelines RT-PCR Tests: ఇటీవలి కాలంలో ఆర్టీ-పీసీఆర్(RT-PCR) టెస్టులు అధికంగా పెరిగిపోయాయని, దాని వల్ల ల్యాబోరేటరీలపై పని భారం పెరిగిందని ఐసీఎంఆర్ పేర్కొంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తాజాగా మరికొన్ని సూచనలు చేసింది.
IPL 2021 Suspended | ఆటగాళ్లకు సైతం కరోనా సోకడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) చరిత్రలో తొలిసారిగా వాయిదా పడింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెటర్లు(Cricket Australia) టీ20 సిరీస్‌ల కోసం ముందుగానే ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేయాలని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు సూచించింది.
Corona 3rd Wave In India Inevitable: యూకే కొత్త వైరస్, డబుల్ మ్యూటెంట్ వంటి కరోనా వైరస్ కొత్త మార్పులపై సైతం కోవిడ్19 టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నా, త్వరలో మరిన్ని మార్పులు జరుగుతాయని, కరోనా మూడో వేవ్ రావడం తథ్యమని ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కె విజయ్ రాఘవన్ పేర్కొన్నారు.
Telangana Corona Positive Cases: రాష్ట్రంలో తాజాగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణలో తాజాగా 6,026 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,75,748కి చేరింది.
Telangana COVID-19 Positive Cases : కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్నా పాజిటివ్ కేసులు, మరణాలు మాత్రం భారీగానే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 6,361 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,69,722కి చేరింది.
Nearest COVID-19 Vaccination Centre: కోవిడ్19 మరణాలు సైతం ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మరోవైపు కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకుగారూ 18 ఏళ్లు పైబడిన అందరికీ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మూడో దశలో కరోనా వ్యాక్సిన్ మొదలైంది.
Michael Hussey Tests Positive For COVID-19: పలు ఫ్రాంచైజీల ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది కరోనా బారిన పడుతుండటంతో ఐపీఎల్ 2021ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేయడం తెలిసిందే. తాజాగా నిర్వహించిన కోవిడ్19 పరీక్షలలో బ్యాటింగ్ కోచ్ హస్సీకి కరోనా సోకినట్లు తేలింది. అయితే మరోసారి టెస్టులు నిర్వహించిన తరువాత అధికారికంగా ప్రకటించేందుకు సీఎస్కే ఫ్రాంచైజీ, మేనేజ్మెంట్ ఎదురుచూస్తోంది.
Curfew guidelines in Indore: ఇండోర్: దేశంలో విజృంభిస్తున్న కరోనావైరస్ను కట్టడి చేసేందుకు వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల ఆంక్షలు అమలులోకి వచ్చాయి. కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ విధిస్తే, ఇంకొన్ని చోట్ల వీకెండ్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఇంకొన్నిచోట్ల పాక్షికంగా లాక్డౌన్ విధిస్తే, కరోనా కేసులు మరీ ఎక్కువగా ఉన్న చోట పూర్తిగా లాక్డౌన్ (Lockdown) విధించారు. ఇలా ఒక్కోచోట ఒకరకమైన కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది.
Hyderabad Zoo park lions tested COVID-19 positive: హైదరాబాద్: కరోనావైరస్ లక్షణాలు మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ కనిపించడం ప్రస్తుతానికి ఆందోళనకు గురి చేస్తోంది. హైదరాబాద్ జూపార్కులోని 8 సింహాలకు కరోనా సోకిందన్న వార్త ప్రస్తుతం జంతు ప్రేమికులను కలవరపాటుకు గురిచేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.