దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాక్డౌన్ విధించడం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వెళ్తున్న వారిపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్తున్న వారికి ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ, తెలంగాణ నుంచి ఏ మార్గంలోనైనా సరే ఢిల్లీకి చేరుకున్న వ్యక్తులను రెండు వారాలపాటు(14 రోజులు) ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉంచాలని ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు లేదా ప్రయాణానికి గరిష్టంగా 72 గంటలలోపు నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్ (RT-PCR) కరోనా టెస్టుల రిపోర్టును వెంట తీసుకురావాలి. ఈ తరహా వ్యక్తులు సైతం 7 రోజులపాటు హోమ్ క్వారంటైన్(Home Quarantine)లో ఉండాలని సూచించారు. తాము కోవిడ్19 వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్నామని తెలిపేందుకు సంబంధిత సర్టిఫికేట్ సమర్పించాలి.
Also Read: RT-PCR Tests: ఆర్టీ-పీసీఆర్ టెస్టులు వీరికి చేయకూడదు, ICMR తాజా మార్గదర్శకాలు విడుదల
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా వైరస్ కొత్త రకం వేరియంట్లు గుర్తించినట్లు రిపోర్టులు వచ్చాయని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(DDMA) తమ ఉత్తర్వులలో పేర్కొంది. ఆ కొత్త రకం కోవిడ్19 వైరస్ వేరియంట్ తక్కువ సమయంలో భారీ సంఖ్యలో వ్యాప్తి చెందుతుందని వెల్లడించింది. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విమానాలు, రైళ్లు, బస్సులు, కార్లు, ఇతరత్రా వాహనాలలో ఢిల్లీకి వచ్చే ప్రయాణికులు కచ్చితంగా కోవిడ్19 నిబంధనలు పాటించడంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read: Corona Third Wave: కరోనా థర్డ్ వేవ్ తప్పదు, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న నిపుణులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook