Congress MP Revanth Reddy | ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, కావాలంటే ఉదయం 6 గంటల నుంచి 10 వరకు అత్యవసర సరుకులు తీసుకుని వెళ్లాలని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పేదలకు పట్టెడన్నం పెట్టాలని వెళ్తున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.
Sputnik Lite COVID-19 Vaccine: ఇదివరకే భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ కరోనా టీకాలు ఇస్తుండగా తాజాగా రష్యా రూపొందించిన వ్యాక్సిన్ స్పుత్నిక్ వి సైతం దేశంలోకి దిగుమతి అవుతుంది. ఈ క్రమంలో రష్యా మరో ప్రకటన చేసింది. ఒకే ఒక్క డోసుతో కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని రష్యా దేశం ప్రకటించింది.
IPL 2021 Players COVID-19 Vaccine: కొన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను ఎలాగైనా ఒప్పించి కరోనా టీకాలు ఇప్పించాలని భావించాయట. ఐపీఎల్ 2021 ప్రారంభానికి ముందుగానే ఆటగాళ్లకు కరోనా టీకాలు ఇప్పించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), ఇండియన్ ప్రీలియర్ లీగ్ (IPL) నిర్వాహకులు భావించినట్లు తెలుస్తోంది.
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినా, మహమ్మారి తీవ్రత మాత్రం అధికంగానే ఉంది. కోవిడ్19 మరణాలు మాత్రం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇదివరకే పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ, పాక్షిక కర్ఫ్యూ అమలుచేస్తుండగా, నేటి నుంచి పశ్చిమ బెంగాల్లో రెండు వారాలపాటు లాక్డౌన్ అమలులో ఉండనుంది..
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో శనివారం 64,362 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 4,298 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో 6,026 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా మరో 32 మంది కరోనాతో మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Hyderabad's Pregnant woman died in ambulance, what led the hospitals to deny admission: హైదరాబాద్: గర్భిణికి చికిత్స అందించడానికి ఆస్పత్రులు నిరాకరించడంతో హైదరాబాద్‌లోని మల్లాపూర్‌కి చెందిన పావని అనే గర్భిణిని కోఠిలోని ప్రసూతి ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్సులోనే మృతి చెందిన ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది. తన బిడ్డ పావనిని (Pregnant Pavani), పావని కడుపులో ఉన్న పసికందును ప్రాణాలతో కాపాడుకునేందుకు పావని తల్లి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
COVID-19 Vaccination in Telangana: హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులపాటు.. అంటే శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కోవిషీల్డ్ ఫస్ట్, సెకండ్ డోస్ వ్యాక్సిన్ల మధ్య గ్యాప్‌ను (Gap between Covishield vaccine first dose and second dose) కేంద్ర ప్రభుత్వం 6-8 వారాల నుంచి కనీసం 12 వారాలకు పెంచిన నేపథ్యంలో ఇదివరకే కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలు కోవిన్ పోర్టల్‌లో అప్డేట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది.
AP 10th class exams schedule: అమరావతి: ఏపీలో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జూన్ 7వ తేదీ నుండి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని, ఈ షెడ్యూల్లో ఎలాంటి మార్పులుచేర్పులు లేవని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు.
Denied admission by five hospitals in Hyderabad, pregnant woman suspected with COVID-19 positive dies in ambulance: హైదరాబాద్: గర్భిణికి చికిత్స అందించడానికి ఐదు ఆస్పత్రులు నిరాకరించడంతో హైదరాబాద్‌లోని మల్లాపూర్‌కి చెందిన పావని అనే గర్భిణి అంబులెన్సులోనే మృతి చెందిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
COVID-19 cases in AP: అమరావతి: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రోజూ 20 వేలకు పైగా కరోనా కేసులు సర్వసాధారణమయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 89,087 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారిలో 22,018 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా ఓ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుదలకు బ్రేకులు పడటం లేదు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 57,416 కరోనా పరీక్షలు చేయగా 4,305 మందికి కరోనా సోకినట్టు గుర్తించామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం కొత్తగా నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలోనే అత్యధికంగా 607 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Sputnik V COVID-19 Vaccine | కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెండం, భారీగా కరోనా మరణాలు నమోదు అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం, డీసీజీఐ మరో కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది.
Nandyala Ravi Passes Away With COVID-19: నటుడు, సినీ జర్నలిస్టు టీఎన్ఆర్ మరణవార్తను మరిచిపోక ముందే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. సినీ రచయిత, దర్శకుడు నంద్యాల రవిని కరోనా మహమ్మారి బలితీసుకుంది.
India Covid-19 Deaths: కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గినా, వరుసగా మూడోరోజు కోవిడ్19 మరణాలు 4 వేలు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది.
Face Mask Side Effects : కోవిడ్19 నిబంధనలు పాటించడం, అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడమే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ముఖానికి మాస్కులు ధరించకపోతే కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిసిందే. ఈ క్రమంలో ముఖానికి మాస్కులు ధరించడంపై గత ఏడాది నుంచి కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
Rajinikanth Gets COVID-19 Vaccination : ఆక్సిజన్ ట్యాంకర్లు, రెమిడెసివర్ ఇంజక్షన్లు, కరోనా కిట్లను సైతం కేంద్ర వైద్యశాఖ అందిస్తోంది. ఇటీవల మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైనా యువతకు మాత్రం టీకాలు ఇవ్వడం లేదు. గురువారం నాడు చెన్నైలోని తన నివాసంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు.
COVID-19 Vaccine Appointment : కరోనా వైరస్ కట్టడిలో మనం భాగస్వాములు కావాలంటే కచ్చితంగా కోవిడ్19 టీకా తీసుకోవాల్సిందేనని వైద్యులు, వైద్య శాఖ నిపుణులు చెబుతున్నారు. ఫస్ట్ డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటే రిజిస్టర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. కొవిన్ యాప్ లేదా వెబ్సైట్ లేదా ఆరోగ్యసేతు యాప్‌లో వ్యాక్సిన్ తీసుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇదివరకే పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ, పాక్షిక కర్ఫ్యూ అమలుచేస్తున్నా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. వరుసగా రెండోరోజు కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదయ్యాయి. కోవిడ్19 మరణాలు సైతం వరుసగా రెండోరోజు 4 వేలు పైగా నమోదు కావడం ఆందోళన పెంచుతోంది.
వలస కూలీలు, దినసరి కార్మికులను లాక్డౌన్ సందర్భంగా వారి స్వస్థలాలకు వెళ్లేందుకు రైలు, బస్సు, విమాన టికెట్లు అందించి గొప్ప సాయాన్ని అందించాడు. తాజాగా కరోనా సెకండ్ వేవ్‌లో టీమిండియా క్రికెటర్లకు సైతం సోనూసూద్ సాయం చేసి కష్టకాలంలో ఆదుకుంటున్నాడు.
Dead Bodies In Ganga River | కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను గంగా, యుమునా నదిలో పడవేయడంతో ప్రజలలో భయాందోళన వ్యక్తమవుతోంది. నీటి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుందనే దానిపై నిపుణులు స్పష్టత ఇచ్చారు. ఇప్పటివరకైతే దాని ద్వారా ఎలాంటి కొత్త కరోనా కేసులను వైద్యులు గుర్తించలేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.