AP SSC Exams Schedule: విద్యార్థులకు పరీక్షా కాలం మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎక్కడ కూడా లీకేజీ తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు కీలక సూచనలు చేశారు.
AP SSC Results 2023: ఏపీలో పదో తరగతి పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పరీక్షల పూర్తయిన వెంటనే మూల్యాంకనం ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 26వ తేదీలోపు మూల్యాంకనం పూర్తిచేసి.. మే మొదటి వారంనాటికి ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
AP SSC Exams Schedule Released: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది. వచ్చే ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి.
AP 10th Exams: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవ తరగతి విద్యార్ధులకు గుడ్న్యూస్ అందించింది. తక్కువ మార్కులొచ్చిన విద్యార్ధుల కోసం ఇంటర్మీడియట్ తరహాలో బెటర్మెంట్ నిర్వహించనుంది.
AP 10th class exams schedule: అమరావతి: ఏపీలో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జూన్ 7వ తేదీ నుండి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని, ఈ షెడ్యూల్లో ఎలాంటి మార్పులుచేర్పులు లేవని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు.
AP SSC Exams 2020 | అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓవైపు కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం పరీక్షల నిర్వహించడానికి మొగ్గు చూపుతుండటం విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోందని ఆయన గుర్తుచేశారు.
10th class exams | అమరావతి : ఏపీలో పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు సిద్ధమయ్యేలా వారిలో మానసిక స్థైర్యం నింపాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ( Minister Adimulapu Suresh) అభిప్రాయపడ్డారు. 10 వ తరగతి పరీక్షలపై సోమవారం ఆయన అన్ని జిల్లాల విద్యా శాఖ ఉన్నతాధికారులు, జాయింట్ కలెక్టర్స్, పేరెంట్స్ కమిటీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ విధించారు. దీంతో ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షలను వాయిదా వేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ పదో తరగతి పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.