Actress Keerthy Suresh Gets Covid-19 Vaccine: మరోవైపు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసులు పలు రాష్ట్రాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల దాకా ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా 'మహానటి' ఫేమ్ కీర్తి సురేష్ కోవిడ్19 వ్యాక్సిన్ తొలి డోసు తీసుకుంది.
India COVID-19 Cases : కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నప్పటికీ, కోవిడ్19 మరణాలు భారీగా నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. తాజాగా పాజిటివ్ కేసుల కన్నా డిశ్ఛార్జ్ కేసులు దాదాపు లక్షకు పైగా అధికం కావడం ఊరటనిచ్చింది. మన దేశంలో ఇప్పటివరకూ 19 కోట్ల 50 లక్షల 4 వేల 184 మందికి టీకాలు వేసినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.
Children get Covid-19 with mild symptoms or asymptomatic: న్యూఢిల్లీ: కరోనా ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే.. కరోనా సెకండ్ వేవ్‌లో కొవిడ్ బారిన పడిన చిన్నారుల సంఖ్య పెరిగిందని నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ కుమార్ పాల్ (Dr Vinod Kumar Paul) తెలిపారు. చిన్నారుల నుంచి పెద్దలకు వైరస్ వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉందని అన్నారు.
DIPCOVAN kit price, uses, testing process:న్యూఢిల్లీ: కరోనాపై పోరులో రక్షణ శాఖ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) దూసుకుపోతోంది. ఇటవలే కరోనా రోగుల కోసం 2డీజీ డ్రగ్‌ను రిలీజ్ చేసిన డీఆర్డీఓ.. తాజాగా సులువుగా, పెద్దగా ఖర్చు లేకుండా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కరోనా యాంటీబాడీలను గుర్తించే టెస్ట్ కిట్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే.
AP COVID-19, krishnapatnam ayurvedic medicine updates : అమరావతి: ఏపీలో కరోనా విజృంభిస్తూనే ఉంది. శుక్రవారం ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన కొవిడ్-19 హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 92,231 కరోనా పరీక్షలు నిర్వహించగా 20,937 మందికి కరోనా సోకినట్టు తేలింది. మరోవైపు క్రిష్ణపట్నం కరోనా ఆయుర్వేదం మందు శాంపిల్స్‌ని ఏపీ సర్కారు ఐసీఎంఆర్ (ICMR)కి పంపించి పరిశోధన చేయిస్తోంది.
Singer Jai Srinivas died due to COVID-19: హైదరాబాద్: తెలంగాణకు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు జై శ్రీనివాస్ ఇక లేరు. ఇటీవలే కరోనా బారినపడిన జై శ్రీనివాస్.. సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. జై శ్రీనివాస్ అసలు పేరు నేరేడుకొమ్మ శ్రీనివాస్
Krishnapatnam ayurvedic medicine for Coronavirus: నెల్లూరు: కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే వ్యక్తి కరోనా నివారణ ఔషధం పేరిట చేస్తోన్న ఆయుర్వేద మందు పంపిణీని ప్రభుత్వం ఆదేశాల మేరకు స్థానిక అధికారులు నిలిపేశారు. కృష్ణపట్నంలో కరోనాకు ఆయుర్వేద మందు పంపిణీ అనగానే నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలు భారీ ఎత్తున కృష్ణపట్నం తరలివచ్చారు.
Covid-19 Symptoms: షుగర్ పేషెంట్లకు బ్లాక్ ఫంగస్ సమస్య వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని, అనియంత్రిత డయాబెటిస్ ఉన్నవారిని త్వరగా దాడి చేస్తుందని తెలిసిందే. కనుక షుగర్ పేషెంట్లు కచ్చితంగా రక్తంలో చక్కెర స్థాయి తగ్గించుకునేందుకు యత్నించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
CM KCR visits MGM Hospital: వరంగల్: సీఎం కేసీఆర్ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పర్యటిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకే ప్రధానమైన కొవిడ్ కేర్ సెంటర్ గా సేవలు అందిస్తున్న ఎంజీఎం హాస్పిటల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలు, కరోనా చికిత్స, మెడిసిన్, ఆక్సీజన్ సరఫరా, తగిన స్థాయిలో వైద్య సిబ్బంది ఉన్నారా లేరా అనే తదితర వివరాల గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ నుంచి సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.
బ్లాక్ ఫంగస్ కేసులకు తోడు తాజాగా వైట్ ఫంగస్ సమస్య మొదలైంది. వైద్యుల చికిత్స ఫలించక భారీ సంఖ్యలో బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత వారం రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ, కోవిడ్19 మరణాలు భారీగా చోటుచేసుకోవడం ఆందోళన పెంచుతోంది.
Chiranjeevi oxygen banks: ప్రాణాపాయ స్థితిలో ఉండి రక్తం లేని కారణంగా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడే ప్రాణాలను రక్షించాలనే దృఢ సంకల్పంతో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకును (Chiranjeevi blood bank) స్థాపించారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు కానున్న ఆక్సీజన్ బ్యాంకులు (Oxygen banks) మరో వారం రోజుల్లో ప్రజలకు అందుబాటులో రానున్నాయి.
COVID-19 tests in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపడానికే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కరోనా పరీక్షలు చేయడం లేదని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి.. '' కరోనా వైరస్‌ను కట్టడి చేసే విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేశాయి'' అని మండి పడ్డారు.
AP COVID-19 cases: అమరావతి: ఏపీలో కరోనావైరస్ వ్యాప్తికి ఇంకా బ్రేకులు పడటం లేదు. గురువారం నాడు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లోని వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏపీలో 114 మంది కరోనాతో చనిపోయారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాపై కరోనా ప్రభావం అధికంగా కనిపిస్తోంది.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 69,252 కరోనా పరీక్షలు చేయగా అందులో 3,660 మంది కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,44,263 కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో యధావిధిగానే జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోనే అత్యధికంగా 574 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు.
Free treatment for COVID-19 and Black fungus: అమరావతి: దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ పథకం పరిధిలోకి తీసుకురావడం ద్వారా పేదలకు ఉచితంగా వైద్యం అందించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రతీ రోజూ ఏపీలో 25 వేల మందికి ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచితంగా కరోనా చికిత్స అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.
White Fungus Symptoms: కరోనా వైరస్ కట్టడికి విఘాతం కలిగిస్తున్న బ్లాక్ ఫంగస్ సమస్యకు పరిష్కారం వెతికేలోగా వైద్య రంగానికి వైట్ ఫంగస్ రూపంలో మరో సవాల్ ఎదురైంది. అసలే ఊపిరితిత్తుల సమస్య, మూడ్రపిండాల దెబ్బతినడం, మెదడుపై తీవ్ర ప్రభావం కారణంగా కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కొందరు చనిపోతున్నారు.
Actress Nayanthara Trolled : నయనతారతో పాటు ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్ సైతం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడు. తాము వ్యాక్సిన్ తీసుకున్నామని, ఏ భయాలు లేకుండా కోవిడ్19 టీకాలు తీసుకోవాలని తమ అభిమానులకు, నెటిజన్లకు ఈ ప్రేమ పక్షులు పిలుపునిచ్చారు.
Asia Cup 2021 cancelled due to COVID-19 | భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మలేషియా దేశాల మధ్య ఆసియా కప్ టీ20 టోర్నీ నిర్వహించాల్సి ఉంది. కానీ గత ఏడాది నుంచి కరోనా ప్రభావం అధికంగా ఉండటంతో పలు టోర్నీల తరహాలోనే ఈ మెగా ఈవెంట్ రద్దు చేశారు.
Black Fungus Infection In Telangana | ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తిస్తే తెలంగాణ వైద్యశాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే సమాచారం అందించాల్సి ఉంటుంది. తెలంగాణ ఆరోగ్యశాఖ దీనిపై చర్యలు తీసుకుంటుంది. మ్యూకర్ మైకోసిస్ ద్వారా కలిగే బ్లాక్ ఫంగస్ సమస్యను నోటిఫైబుల్ వ్యాధి అని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
India Corona Cases: నిన్నటి కేసులతో పోల్చితే మరోసారి పాజిటివ్ కేసులు పెరిగాయి. దేశ వ్యాప్తంగా బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో తాజాగా 2,76,070 మంది కరోనా బారిన పడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.