PIB Fact check on Lockdown in India: న్యూఢిల్లీ : మే 2వ తేదీన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాగానే 3వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తారని సోషల్ మీడియాలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో మరోసారి లాక్డౌన్ వస్తే తమ పరిస్థితి ఏంటని వలస కార్మికులు, రోజువారీ కూలీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు దేశవ్యాప్తంగా మే 3వ తేదీ నుంచి లాక్డౌన్ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్రం తరపున ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ చేసి జనానికి క్లారిటీ ఇచ్చింది. దీంతో లాక్డౌన్ గురించి జరుగుతున్న ప్రచారం గురించి ఓ స్పష్టత లభించినట్టయింది.
మే 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దేశంలో లాక్డౌన్ విధిస్తారని, అందుకు కేంద్రం ఏర్పాట్లు చేసుకుంటోందంటూ ఓ న్యూస్ చానెల్ ప్రసారం చేసినట్లుగా ఉన్న కొన్ని గ్రాఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వదంతుల్లో ఏ మాత్రం నిజం లేదని పీఐబీ (PIB fact check) ట్విటర్ ద్వారా స్పష్టంచేసింది.
सोशल मीडिया पर वायरल हो रहे एक पोस्ट में दावा किया जा रहा है कि केंद्र सरकार ने देश में 3 मई से 20 मई तक सम्पूर्ण लॉकडाउन लगाने की घोषणा की है।#PIBFactCheck: यह दावा #फर्जी है। केंद्र सरकार ने ऐसी कोई घोषणा नहीं की है। pic.twitter.com/Xt93IDnMcc
— PIB Fact Check (@PIBFactCheck) April 30, 2021
Also read : Minister Eatala Rajender news: మంత్రి ఈటెల రాజేందర్‌కు షాక్, వైద్య ఆరోగ్య శాఖ నుంచి తొలగింపు
ఇదిలావుంటే, ప్రస్తుతానికి లాక్డౌన్ విధించాల్సిన అవసరం లేదని, కాకపోతే కరోనావైరస్ వ్యాప్తిని (Corona second wave) అరికట్టేందుకు కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించాలని, ఆయా కంటైన్మెంట్ జోన్లలో కఠిన ఆంక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులను ఇటీవలే కేంద్ర హోంశాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఇదే విషయాన్ని స్పష్టంచేస్తూ ఇటీవల ఓ ప్రకటన జారీచేయడాన్ని గ్రహించాల్సి ఉంటుంది.
Also read : దేశవ్యాప్తంగా Lockdown విధిస్తారా ? క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి Nirmala Sitharaman
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook