ఇజ్రాయిల్ రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తున్నామని, ఇక నుండి రికార్డులలో ఇజ్రాయిల్ రాజధానిగా టెల్ అవీవ్ బదులు జెరూసలేం అని నమోదు చేయాలని ఆయన అమెరికన్ ఎంబసీకి లేఖ రాశారు
2017 సంవత్సరానికి గానూ ప్రధాని నరేంద్ర మోదీ 'మోస్ట్ ట్వీటేడ్ అబౌట్ వరల్డ్ లీడర్' జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరువాతి స్థానంలో నిలిచారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దానగుణాన్ని చాటుకున్నారు. ఒక అధ్యక్షుడిగా ప్రభుత్వం నుండి తాను తీసుకొనే జీతాన్ని ఆయన ప్రభుత్వ వైద్య, మానవ సేవల శాఖకు విరాళంగా ఇచ్చేశారు.
ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రతీ యేడాది "పర్సన్ ఆఫ్ ది ఇయర్" అవార్డును ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సంవత్సరం కూడా తననే ఆ అవార్డుకు ఎన్నుకొనే అవకాశం ఉందని భావించిన ట్రంప్, తనను ఆ గౌరవానికి ఎంపిక చేయవద్దని ట్విటర్ వేదికగా కోరారు.
నన్ను భయపెట్టేందుకే ట్రంప్ ఆసియా పర్యటనకు వచ్చాడని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ధ్వజమెత్తాడు. ఆయన యుద్ధాన్ని అడుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని ఎత్తులు, పైఎత్తులు వేసినా ట్రంప్ ఉత్తర కొరియాను భయపెట్టలేడని అన్నారు. ఇప్పటివరకు నెమ్మదిగా సాగిన మా అణ్వాయుధాల అభివృద్ధి ఇకపై వేగం పుంజుకుంటాయని ఆయన ఒక ప్రకటనలో చెప్పారు.
సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అయ్యింది. ఒక సైక్లిస్ట్ మహిళ అదేదారిలో వెళుతున్న కాన్వాయ్ ను చూసి తన మధ్యవేలిని గాల్లోకి ఎత్తి చూపింది. ఈ చిత్రాన్ని న్యూస్ ఏజెన్సీ 'ఏఎఫ్పి' ఫోటోగ్రాఫర్ బ్రెండన్ స్మియాలోవ్ స్కీ తన కెమెరాలో బంధించాడు. ఆ చిత్రం వెంటనే వైరల్ అయ్యింది. అంతలా ఏముందనేగా మీ డౌట్? ఆ కాన్వాయ్ లో వెళుతున్నది అమెరికా అధ్యక్షుడు అందుకే అంత వైరల్. ఈ ఘటన వాషింగ్టన్ లోని గోల్ఫ్ క్లబ్ రహదారిపై జరిగింది.
11 రోజుల ఆసియా పర్యటన యాత్రకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయల్దేరారు. ఆసియా యాత్రలో భాగంగా ఆయన జపాన్, దక్షిణ కొరియా, చైనా, వియత్నాం, పిలిప్పీన్స్ దేశాల్లో పర్యటించనున్నారు. గత 25 ఏళ్లలో ఓ అమెరికా అధ్యక్షుడు ఆసియాలో 10 రోజులకు పైగా పర్యటించడం ఇదే తొలిసారి. 1991-1992 మధ్య కాలంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ ఆసియా దేశాల్లో సుదీర్ఘంగా పర్యటించారు.
యునెస్కో (యూనైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనేజేషన్) నుండి ఆశ్చర్యకరమైన రీతిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనల మేరకు ఆ దేశ ప్రభుత్వం నిష్క్రమించింది. ఇజ్రాయెల్ వ్యతిరేకతను యునెస్కో కొనసాగిస్తుండటంపై నిరసన వ్యక్తం చేస్తూ, ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పరిశీలకుడి పాత్రను పోషించడానికి తమకు అభ్యంతరం లేదని అమెరికా ప్రభుత్వం తెలిపింది. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపింది. యునెస్కోలో సంస్కరణాపరమైన విధానాలు రూపుదిద్దుకోవాలని పిలుపునిచ్చింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఓ ఆంగ్ల పత్రికతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత మీడియాపై కోప్పడ్డారు ‘మీడియా అనేది ఫేక్ అన్నమాట నూటికి నూరుపాళ్ళు సత్యం. అసలు ఫేక్ అనే పదాన్ని కనిపెట్టిందే నేను. అయితే ఆ పదం చాలా రోజుల నుండి జనబాహుళ్యంలో ఉంది. ఆ విషయం ఇంతవరకు నేను గమనించలేదు. నేడు ఫేక్ వార్తల వల్ల అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. మన దేశ గొప్పతనాన్ని మన మీడియాయే పణంగా పెట్టడం విచారకరం’ అని ట్రంప్ ప్రస్తుత మీడియా వ్యవస్థపై ఆరోపణలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.