నన్ను భయపెట్టేందుకే ట్రంప్ ఆసియా పర్యటనకు వచ్చాడని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ధ్వజమెత్తాడు. ఆయన యుద్ధాన్ని అడుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని ఎత్తులు, పైఎత్తులు వేసినా ట్రంప్ ఉత్తర కొరియాను భయపెట్టలేడని అన్నారు. ఇప్పటివరకు నెమ్మదిగా సాగిన మా అణ్వాయుధాల అభివృద్ధి ఇకపై వేగం పుంజుకుంటాయని ఆయన ఒక ప్రకటనలో చెప్పారు.
సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అయ్యింది. ఒక సైక్లిస్ట్ మహిళ అదేదారిలో వెళుతున్న కాన్వాయ్ ను చూసి తన మధ్యవేలిని గాల్లోకి ఎత్తి చూపింది. ఈ చిత్రాన్ని న్యూస్ ఏజెన్సీ 'ఏఎఫ్పి' ఫోటోగ్రాఫర్ బ్రెండన్ స్మియాలోవ్ స్కీ తన కెమెరాలో బంధించాడు. ఆ చిత్రం వెంటనే వైరల్ అయ్యింది. అంతలా ఏముందనేగా మీ డౌట్? ఆ కాన్వాయ్ లో వెళుతున్నది అమెరికా అధ్యక్షుడు అందుకే అంత వైరల్. ఈ ఘటన వాషింగ్టన్ లోని గోల్ఫ్ క్లబ్ రహదారిపై జరిగింది.
11 రోజుల ఆసియా పర్యటన యాత్రకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయల్దేరారు. ఆసియా యాత్రలో భాగంగా ఆయన జపాన్, దక్షిణ కొరియా, చైనా, వియత్నాం, పిలిప్పీన్స్ దేశాల్లో పర్యటించనున్నారు. గత 25 ఏళ్లలో ఓ అమెరికా అధ్యక్షుడు ఆసియాలో 10 రోజులకు పైగా పర్యటించడం ఇదే తొలిసారి. 1991-1992 మధ్య కాలంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ ఆసియా దేశాల్లో సుదీర్ఘంగా పర్యటించారు.
యునెస్కో (యూనైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనేజేషన్) నుండి ఆశ్చర్యకరమైన రీతిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనల మేరకు ఆ దేశ ప్రభుత్వం నిష్క్రమించింది. ఇజ్రాయెల్ వ్యతిరేకతను యునెస్కో కొనసాగిస్తుండటంపై నిరసన వ్యక్తం చేస్తూ, ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పరిశీలకుడి పాత్రను పోషించడానికి తమకు అభ్యంతరం లేదని అమెరికా ప్రభుత్వం తెలిపింది. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపింది. యునెస్కోలో సంస్కరణాపరమైన విధానాలు రూపుదిద్దుకోవాలని పిలుపునిచ్చింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఓ ఆంగ్ల పత్రికతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత మీడియాపై కోప్పడ్డారు ‘మీడియా అనేది ఫేక్ అన్నమాట నూటికి నూరుపాళ్ళు సత్యం. అసలు ఫేక్ అనే పదాన్ని కనిపెట్టిందే నేను. అయితే ఆ పదం చాలా రోజుల నుండి జనబాహుళ్యంలో ఉంది. ఆ విషయం ఇంతవరకు నేను గమనించలేదు. నేడు ఫేక్ వార్తల వల్ల అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. మన దేశ గొప్పతనాన్ని మన మీడియాయే పణంగా పెట్టడం విచారకరం’ అని ట్రంప్ ప్రస్తుత మీడియా వ్యవస్థపై ఆరోపణలు చేశారు.
ఉత్తర కొరియా మరో క్షిపణి పరీక్ష చేసేందుకు సిద్ధంగా ఉందని.. అందుకు అనువైన రోజు కోసం ఎదురు చూస్తోందని అమెరికా ఇంటెలిన్స్ వర్గాలు భావిస్తున్నాయి. అక్టోబర్ 10న ఉత్తర కొరియాలో జరగబోయే వర్కర్స్ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా, ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని.. బలప్రదర్శనకు దిగినా ఆశ్చర్యపోనవసరం లేదని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. దీంతో అమెరికాలోని పలు సీక్రెట్ ఏజెన్సీలు అప్రమత్తమైనట్లు వార్తలు వస్తున్నాయి. పైగా అక్టోబర్ 9న అమెరికాలో ‘కొలంబస్ డే’ కావున, సాధారణంగా సెలవుదినంగా ప్రకటిస్తారు.
డొనాల్డ్ ట్రంప్ ఒక మానసిక రోగని... క్యూబా విప్లవనాయకుడు చెగువేరా కుమార్తె ఎలీదా గువేరా అమెరికా అధ్యక్షునిపై విరుచుకుపడ్డారు. ఆయన ప్రవర్తిస్తున్న తీరు వల్ల యావత్ ప్రపంచమే నేడు అనుకోని ప్రమాదంలో పడిపోయే అవకాశముని ఆమె అభిప్రాయపడ్డారు. ఆయన చర్యల వలన మానవత్వం రూపురేఖలు మారిపోతాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 57 ఏళ్ల ఎలీదా గువేరా క్యూబా రాజధాని హవానాలో ది వీక్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆమె ట్రంప్ శైలిని ఘాటుగా విమర్శించారు. ‘ట్రంప్ విధానాల పట్ల, అతని వ్యవహార శైలిపై మనమంతా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గత కొంతకాలంగా సాగుతున్న ఉత్తర కొరియా, అమెరికాల మధ్య అరాచక రాజకీయాలు ఎలాంటి భవిష్యత్తు మారణహోమాలకు నాంది పలుకుతాయోనని ఆయా రాజ్యాల సరిహద్దు దేశాలు కలవరపడుతున్నాయి. అమెరికాను క్షమించేది లేదని.. దాని వినాశనమే తమ లక్ష్యమని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రతిజ్ఞ చేశారు. దాదాపు 2 లక్షల మంది దేశ పౌరులు ఆర్మీలో చేరిన క్రమంలో 'యాంటీ అమెరికా వార్' అంటూ సాగిన స్లోగన్స్ మధ్య వారికోసం కిమ్ జోంగ్ ఒక ప్రత్యేక మీటింగును ఏర్పాటు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్ బుక్ సంస్థ ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు. ఈ విషయంపై ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ మాట్లాడుతూ తమ సంస్థ ఎల్లవేళలా తటస్థంగా ఉండడానికే ప్రయత్నిస్తుందని చెప్పారు.ట్రంప్ ఫేస్ బుక్ సంస్థను విమర్శిస్తూ, ఈ సోషల్ మీడియా సంస్థ ఎప్పుడూ తనకు వ్యతిరేకమేనని తెలిపారు. ఎల్లో జర్నలిజంతో కూడిన వార్తలు ప్రచురించడం, పక్షపాత వైఖరి చూపించడం ఫేస్ బుక్ నైజమని తెలియజేశారు. సాధారణంగా 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో రష్యా పాత్రపై కూడా ఫేస్ బుక్ దర్యాప్తుకు సహకరిస్తామని చెప్పిందని, సాధారణంగా ఏదైనా నచ్చని వార్తా
న్యూయార్క్‌లో తన పర్యటనలో భాగంగా అమెరికా ప్రధాని డొనాల్ఢ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ను కలిసిన భారత విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్, మహిళా వ్యవస్థాపకత, ఇరు దేశాల్లో శ్రామికాభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ఆ క్రమంలో ఇవాంకా మాట్లాడుతూ సుష్మా స్వరాజ్‌ను ఆకర్షణీయమైన విదేశాంగ మంత్రిగా అభివర్ణించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.