Havoc Floods: భారీ వర్షాలు ఉత్తరాదిని అల్లకల్లోలం చేస్తున్నాయి. గత మూడ్రోజుల్నించి కురుస్తున్న భారీ వర్షాలు ఇంకా వెంటాడుతున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతూ లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తుతున్నాయి. వరద ధాటికి అడ్డొచ్చినవాటికి లాక్కెళ్లిపోతున్నాయి.
Congo Floods: ఆఫ్రికా దేశమైన కాంగోను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దక్షిణ కివు ఫ్రావిన్స్ ను వరద నీరు పోటెత్తడంతో.. రెండు వందల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గల్లంతయ్యారు.
Heavy Rain Lashes Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షానికి నిమిషాల వ్యవధిలోనే రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రెండురోజుల క్రితం సికింద్రాబాద్‌లో జరిగిన మౌనిక దుర్ఘటన దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు.
Heavy Floods kill at least 120 in Congo. భారీ వర్షాల కారణంగా డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా కాంగో రాజధాని కిన్షాసాలో భారీ వరదలు విలయం సృష్టిస్తున్నాయి.
Pakistan: ప్యాసింజర్స్ తో వెళ్తున్న ఓ వ్యాన్ నీటి గుంతలో బోల్తాపడిన ఘటనలో 12 మంది చిన్నారులతోసహా 20 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో జరిగింది.
Philippines Storm: ఫిలిప్పీన్స్ లో కురుస్తున్న కుండపోత వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 42 మంది మృత్యువాతపడ్డారు. మరో 16 మంది గల్లంతయ్యారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
Srisailam Dam : ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ పొంగిపొర్లుతోంది. శ్రీశైలం డ్యామ్‌కు జల కళ సంతరించుకుంది. కృష్ణమ్మ పరుగులుతీస్తోంది. శ్రీశైలం డ్యామ్ చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంది.
Jammalamadugu Dam : కడప జిల్లాలోని జమ్మలమడుగు డ్యాం వద్ద ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. పెన్నా నది వరదల కారణంగానే డ్యాం వద్ద ఈ పరిస్థితి ఏర్పడింది. పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Srisailam Dam Gates Opened : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. వరద పెరగడంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. అధికారులు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
AP Floods: ఏపీలో మళ్లీ వరదలు సంభవించే అవకాశం కనిపిస్తోంది. గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ అయ్యింది.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా తగ్గింది. గోదావరిలో నీటిమట్టం శనివారం (ఆగస్టు 13) 51.3 అడుగులకు చేరింది. గోదావరి వరద ఉధృతితో భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఆగడం లేదు. మొన్నటి వరకూ భారీ వర్షాలు, వరదలతో కుదేలైన రాష్ట్రాలు ఇప్పుడు మరోసారి వర్షాల బారిన పడ్డాయి. రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి.
ఏపీ, తెలంగాణ తరువాత ఇప్పుడు కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగుపై కల్వర్ట్ దాటుతుండగా..ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. చుట్టూ ఉన్న జనం కేకలు పెట్టడం, వీడియో తీసేందుకు ఆసక్తి చూపించారు తప్పిస్తే..కాపాడే ప్రయత్నాలు చేయలేదు.
Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా పోరాటాన్ని ఉధృతం చేసింది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది.
Musi River Flood: హైదరాబాద్‌లోని మూసీ నది వరద నీటితో పోటెత్తుతోంది. నగరంలోని జాలాశయాల్నించి నీరు వదలడంతో మూసీ ప్రవాహం పెరుగుతోంది. మూసీ నది పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రదేశాలు ముంపుకు గురవుతున్నాయి.
Gandipet floods: గండిపేట్ వరదల్లో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని ఎన్.డి.ఆర్.ఎఫ్. సిబ్బంది, నార్సింగ్ పోలీసులు దాదాపుగా 5 గంటల పాటు శ్రమించి కాపాడారు. పడవ సహాయంతో వారి దగ్గరికి చేరుకుని వారిని రెస్క్యూ చేశారు.
CM Jagan: అల్లూరి సీతారామరాజు జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శిస్తూ..వారికి భరోసాను ఇస్తున్నారు. తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
Sriramsagar project: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. ప్రాజెక్టుకు చెందిన 18 గేట్లను ఎత్తి..ఇన్ ఫ్లో మొత్తం దిగువకు వదిలేస్తున్నారు. ప్రాజెక్టు నీటి సామర్ధ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 70 టీఎంసీల వరకూ నీరుంది.
Mahaboobabad Heavy Rains : మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. చెరువులు మత్తడిపోస్తున్నాయి. అనేక చోట్ల రహదారులపైకి వరద నీరు రావడంతో రహదారులు తెగి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.