Alert To Hyderabad Water Supply Shutdown Two Days: హైదరాబాద్‌వాసులకు బిగ్ అలర్ట్. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో నీటి సరఫరా నిలిచిపోనుంది. మరమ్మతు పనుల నేపథ్యంలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.
Vastu Changes In Telangana State Secretariat: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాస్తుపై విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయన కూడా వాస్తు మార్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Southwest Monsoon Enters To Telangana State: తెలంగాణలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి. కేరళను తాకి ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణలోకి రుతు పవనాలు ప్రవేశించడంతో వర్షాలు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Srikanth -4th anniversary program of New Life Physiotherapy: న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ 4వ వార్షికోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Former CM KCR Emotional In Telangana Formation Day: తెలంగాణతో తనకు ఉన్న అనుబంధంపై కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఉద్యమం, పరిపాలన కాలాన్ని గుర్తు చేసుకుంటూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో ఒక ఉద్విగ్నతకు గురయ్యారు.
Hyderabad: బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ, అసదుద్దీన్ ఒవైసీ మీద ఫైర్ అయ్యారు. తమ నాయకుడు మోదీ మెడిటేషన్ చేసిన కూడా రచ్చ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
Boyfriend Rejected Marriage Young Woman: కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారాలు నడిపి తీరా పెళ్లి చేసుకోమంటే తోక ముడవడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని జీడిమెట్లలో చోటుచేసుకుంది. ప్రియుడు అఖిల్ సాయిగౌడ్‌పై కేసు నమోదైంది.
Pastor Brutally Attack On Woman Shepherd: హైదరాబాద్ శివారు గుర్రంగూడలో మేకలు మేపుతున్న మహిళపై ఓ చర్చ్ పాస్టర్ దారుణంగా దాడికి పాల్పడ్డారు. చీపురు పట్టుకుని ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Police Harassed Girl: ట్రైన్ తిరుపతి నుంచి హైదరాబాద్ కు వస్తుంది. ఇంతలో రాత్రిపూట యూనిఫామ్ వేసుకున్న ఒక హోమ్ గార్డు ట్రైన్ లోకి కోచ్ లోకి వచ్చాడు. అంతటితో ఆగకుండా నిద్రిస్తున్న యువతి దగ్గరకు వెళ్లి వెకిలి చేష్టలు వేశాడు. దీంతో ఆమె ఉలిక్కి పడిలేచింది.
Gang War In Uppal: హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో అల్లరిమూకలు హల్చల్ చేశాయి. క్రికెట్ ఆడే సమయంలో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగ్గా స్థానికులపై అల్లరిమూక రెచ్చిపోయింది. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఈగ సంతోష్ ముదిరాజ్‌పై స్థానిక రౌడీ లఖాన్ మోడల్ దాడికి పాల్పడ్డాడు. దాదాపు ఐదు మంది గాయపడగా వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Hyderabad: తెలంగాణ ప్రజాభవన్ మరికాసేపట్లో పేలిపోతుందంటూ ఆగంతకుడు కంట్రోల్ రూమ్ కు కాల్ చేశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం ఒక్కసారిగా హైదరాబాద్ లో హైటెన్షన్ గా మారింది.
Vijayawada Accident: హైదరాబాద్- విజయవాడ మార్గంలో ఘోర ప్రమాదం సంభవించింది. అదుపు తప్పిన కారు లారీని ఢీకొట్టింది. డివైడర్‌పైకి ఎక్కి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తమిళనాడుకు చెందినవారు.
No More Common Capital To Telugu States: రాష్ట్ర విభజన సమయంలో పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచిన విషయం తెలిసిందే. జూన్ 2వ తేదీన పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ మధ్య బంధం తెగనుంది. రాజధాని లేకపోవడంతో ఉమ్మడి రాజధానిగా ఏపీకి చేశారు.
Balakrishna Meets Revanth Reddy: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. మర్యాదపూర్వకంగా వీరి భేటీ జరిగింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించుకున్నారు.
Madeenaguda: శేరిలింగంపల్లి గ్రామంలోని మదీనాగూడాలో పోచమ్మ తల్లి ఆలయం ఉంది. ఇది స్వయంభూగా వెలసిందని చెబుతుంటారు. ఇటీవల మూడు రోజుల నుంచి అమ్మవారు పాలుతాగుతున్న విషయంను పూజారీ గమనించాడు. ఈ రోజు శుక్రవారం ఆలయ సిబ్బందికి చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.