దేశవ్యాప్తంగా దసరా (విజయదశమి) సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల నుంచి అత్యంత వైభవంగా ప్రకాశవంతంగా జరిగిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు (Navratri 2020) నేటితో ముగియనున్నాయి. దేవినవరాత్రుల్లో భాగంగా చివరిరోజు.. దసరా (విజయదశమి) పర్వదినం నాడు శ్రీ కనకదుర్గా దేవీ సాక్షాత్తూ సిద్ధిధాత్రి శాక్తేయానుసారముగా శ్రీ రాజరాజేశ్వరి దేవి ( Sri Rajarajeshwari Devi) గా దర్శనమివ్వనుంది.
ఆశ్వీయుజ మాసం శుక్లపక్షంలోని మొదటి తొమ్మిది రోజులపాటు దేవిశరన్నవరాత్రుల్లో (navaratri 2020) భాగంగా కనకదుర్గా దేవిని రోజుకొక అవతారంలో భక్తులు పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆశ్వీయుజ దశమినాడు ‘దసరా’ (Dussehra 2020) లేదా విజయదశమిగా జరుపుకుంటారు. అయితే దసరా సంబరాలు చివరిరోజుకి చేరుకోగానే అందరికీ గుర్తుకువచ్చేది శమీపూజ (జమ్మిచెట్టు) (Jammy Chettu), పాలపిట్ట (Palapitta) దర్శనం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.