Godavari river water: హైదరాబాద్: గోదావరి నది జలాల వినియోగంలో ఏపీకి అన్యాయం జరిగేలా అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందన్న ఏపీ వాదనలను తెలంగాణ ఖండించింది. నిన్న రెండు రాష్ట్రాల మధ్య జల వివాదంపై కృష్ణా రివర్ బోర్డ్ ( Krishna river board) సమావేశం ఏర్పాటు చేయగా.. ఇవాళ జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు ( Godavari river board) సమావేశమైంది.
తెలంగాణ రైతాంగానికి త్వరలోనే ఓ గుడ్ న్యూస్ ( Good news to farmers ) చెబుతానని సీఎం కేసీఆర్ ( Telangana CM KCR ) ప్రకటించారు. శుక్రవారం ఉదయం కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం ( Kondapochamma Sagar inauguration ) అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య అంశాలలో నీరు ఒకటి. టీఆర్ఎస్ సర్కార్ తాగు, సాగునీటిపై అందుకే ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో నేడు మహత్తర ఘట్టం చోటుచేసుకోనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.