AP 10th class exams schedule: అమరావతి: ఏపీలో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జూన్ 7వ తేదీ నుండి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని, ఈ షెడ్యూల్లో ఎలాంటి మార్పులుచేర్పులు లేవని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు.
COVID-19 cases in AP: అమరావతి: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రోజూ 20 వేలకు పైగా కరోనా కేసులు సర్వసాధారణమయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 89,087 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారిలో 22,018 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా ఓ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుదలకు బ్రేకులు పడటం లేదు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 57,416 కరోనా పరీక్షలు చేయగా 4,305 మందికి కరోనా సోకినట్టు గుర్తించామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం కొత్తగా నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలోనే అత్యధికంగా 607 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Supreme Court: కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. సెలెబ్రిటీలు, ప్రముఖులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కరోనా పాజిటివ్ గా తేలింది.
ICMR on Lockdown: దేశంలో కరోనా మహమ్మారి భయంకరంగా విజృంభిస్తోంది. రాష్ట్రాలు లాక్డౌన్ బాట పట్టాయి. ఈ నేపధ్యంలో ఐసీఎంఆర్ ఛీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా నియంత్రణకు లాక్డౌన్ ఒక్కటే ప్రత్యామ్నాయమంటున్నారు.
Ap Corona Update: కరోనా వైరస్ ఉధృతి ఏ మాత్రం ఆగడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండవ రోజు కూడా పెద్దఎత్తున కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా నిర్ధారణ పరిక్షలు కూడా పెరిగాయి.
Liquor Sales: కొంపలు మునిగిపోతున్నా..కాలిపోతున్నా మందుబాబులు మందు మాత్రం మానరు కదా. ఓ వైపు కరోనా చంపేస్తుందని అంటున్నా..మందుబాబులు ఎగబడ్డారు. కేవలం రెండ్రోజుల వ్యవధిలో ఎంత తాగేశారో తెలుసా..
Covid-19 Variant B.1.617 | భారీ కోవిడ్19 మరణాలకు కారణమైన కరోనా వేరియంట్ B.1.617 వైరస్‌ను గత ఏడాది అక్టోబర్‌లో గుర్తించారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) తాజాగా వెల్లడించింది.
Don’t stop ambulances entering Telangana: TS High Court హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపేస్తున్నారనే అంశాన్ని తెలంగాణ హై కోర్టు తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్సులను ఆపడం అంటే అది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని అభిప్రాయపడిన హైకోర్టు... సరిహద్దుల్లో అంబులెన్స్ నిలిపివేతపై ఆదేశాలేమైనా ఉన్నాయా ? అని ప్రశ్నించింది.
How to apply for e-pass in Telangana state: హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నుండి పది రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రేపటి నుంచే ఈ లాక్డౌన్ అమలులోకి రానున్న నేపథ్యంలో ఇంటి నుంచి బయటికి రావాలంటే ఏమేం కావాలి, ఎవరి నుంచి అనుమతులు తీసుకోవాలి అంటూ అనేక సందేహాలతో పౌరులు అయోమయానికి గురవుతున్నారు. వారి సందేహాలకు సమాధానం ఇస్తూ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
Telangana Lockdown: కరోనా మహమ్మారి నియంత్రణకై తెలంగాణ రాష్ట్రం సైతం లాక్డౌన్ ప్రకటించింది. అయితే లాక్డౌన్ విధించకపోవడంపై ఆగ్రహించిన హైకోర్టు..హఠాత్తుగా లాక్డౌన్ ప్రకటనపై కూడా కీలక వ్యాఖ్యలు చేసింది.
Wine Shops In Telangana During Lockdown: లాక్డౌన్ ప్రకటన రాగానే తెలంగాణలో మందుబాబులు అప్రమత్తమయ్యారు. మే 12 నుంచి 10 రోజులపాటు లాక్డౌన్ అమలులో ఉండనుంది. లాక్డౌన్ నేపథ్యంలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
Telanagana Lockdown: కరోనా మహమ్మారి నియంత్రణకు మరో రాష్ట్రం లాక్డౌన్ బాటపట్టింది. దేశంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ అమలు చేస్తుండగా..ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సైతం అమలు కాబోతుంది.
Telangana Lockdown: కరోనా పరిస్థితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానాలు సూచనలిస్తున్నాయి. ఒక్కోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ హైకోర్టు ..ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరించింది. లాక్‌డౌన్‌పై స్పష్టత కోరింది.
Telangana lockdown updates: హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తే తప్ప కరోనా పాజిటివ్ కేసులు అదుపులోకి రావనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు సైతం ఈ అంశంపై ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం రానే వచ్చింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రేపు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది.
COVID-19 Lockdown In India: ప్రతిరోజూ 4 లక్షలకు పైగా కరోనా కేసులు, ఇటీవల కరోనా మరణాలు సైతం 4 వేలు దాటుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్‌డౌన్‌ను తమ అస్త్రంగా చేసుకున్నాయి. ప్రాణ నష్టాన్ని నివారించడం, వైరస్‌పై విజయం సాధించడానికి లాక్డౌన్ విధిస్తున్నారు.
Ap Covid Update: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పెద్దఎత్తున కేసులు వెలుగు చూస్తున్నాయి. ఏపీలో కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..
IMA calls for nation wide lockdown: న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండటంతో పాటు వైద్య సదుపాయాలు, ఆక్సీజన్ కొరత, బెడ్స్ లేక రోగులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించాల్సిన అవసరం కనిపిస్తోందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభిప్రాయపడింది. ఈ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు ఓ లేఖ రాసింది.
Tamilnadu lockdown: దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా మహమ్మారి కట్టడికి రాష్ట్రాలు లాక్డౌన్ బాట పడుతున్నాయి. మరో రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ విధించారు.
Telangana CM KCR about lockdown in Telangana state: హైదరాబాద్: తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లో లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించే విషయంలో గత అనుభవాలతో పాటు ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు ఇతర రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించినప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించడం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. అంతకంటే ముందుగా ప్రధాని మోదీతో మాట్లాడిన సీఎం కేసీఆర్... రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు (remdesivir injections), ఆక్సీజన్ సప్లై (Oxygen supply) విషయంలోనే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.