అసలే.. 'కరోనా వైరస్'.. ఆపై లాక్ డౌన్.. ఈ క్రమంలో వలస కూలీలు ఆగమాగమైపోతున్నారు. బతుకుదెరువు కోసం జన్మనిచ్చిన ఊరును వదిలి.. పొట్ట చేతపట్టుకుని రాష్ట్రాలకు రాష్ట్రాలు దాటి వచ్చేశారు. ఇప్పుడు కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా.. బతుకుదెరువు లేక.. బతికే మార్గం తెలియక.. మళ్లీ సొంతూళ్లకు తిరిగి వెళ్తున్నారు.
మధ్య ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం (Madhya pradesh political crisis) ముదురుతోంది. జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పడంతో మొదలైన రాజకీయ సంక్షోభం.. ఆయన వెంటే 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో మరింత ముదిరింది. జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ (BJP)లో చేరిన అనంతరం పరిణామాలు పరిశీలిస్తే.. కమల్ నాథ్ సర్కార్ (Kamal Nath govt) ఈ కష్టాన్ని గట్టెక్కడం కష్టమేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌లో సొంత ప్రభుత్వంపైనే తీవ్ర ఆగ్రహం చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మున్నాలాల్ గోయల్.. ఏకంగా అసెంబ్లీ ఆవరణలోనే ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి కమల్ నాథ్‌కి వ్యతిరేకంగా ఎమ్మెల్యే దీక్షకు దిగడానికి కారణం ఏంటో మీరే చూడండి మరి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.