Police and Municipal staff to get COVID-19 vaccine: హైదరాబాద్: రేపటి నుంచి పోలీస్, మున్సిపల్ సిబ్బందికి కొవిడ్-19 వ్యాక్సిన్ ఇస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. కరోనావైరస్ మహమ్మారిని తరిమికొట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి ఈటల తెలిపారు.
Aarogyasri scheme in Telangana: హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ( Minister Etela Rajender ) గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం అమలు అవుతున్న ఆరోగ్య శ్రీ పథకంలోకి ( Aarogyasri Scheme in Telangana ) మరిన్ని సేవలను తీసుకురాబోతున్నట్టు మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు.
కరోనా వైరస్ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ కోవిడ్19 టెస్టులు జరిపిస్తున్నామని, తెలంగాణలో ఇప్పటివరకూ కమ్యూనిటీ స్ప్రెడ్ జరగలేదని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. కరోనా టెస్టులకు ధర (CoronaVirus Test Cost) నిర్ణయించినట్లు తెలిపారు.
తన భర్త మధుసూదన్ ఆచూకీ కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన వనస్థలిపురం మహిళకు.. ఆమె భర్త కరోనాతో మృతి చెందగా జీహెచ్ఎంసీ సిబ్బందే ( GHMC ) అంత్యక్రియలు పూర్తిచేశారని తెలిసిన విషయం నగరంలో ఎంత వివాదమైందో తెలిసిందే. భార్యకు కూడా చెప్పకుండానే భర్త శవానికి ఎలా అంత్యక్రియలు ( Cremation ) పూర్తి చేస్తారని మహిళ నిలదీసిన నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ( Minister Etela Rajender ) ఆ వివాదంపై స్పందించారు.
తెలంగాణలో మంగళవారం కొత్తగా మరో 51 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్ఎంసీ పరిధిలోనివి 37 కాగా వలసకూలీలు 14 మంది ఉన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనావైరస్ బారినపడిన వారి సంఖ్య మొత్తం 1,326కి చేరుకుంది.
తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇదివరకు తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసుల సంఖ్యలో తాజాగా స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. తెలంగాణలో నేడు కొత్తగా మరో 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో నేడు కొత్తగా మరో 10 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,132 కి చేరింది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 29 మంది మృతి చెందారు.
తెలంగాణలో బుధవారం కొత్తగా 11 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (COVID-19 positive cases) నమోదయ్యాయి. ఈ 11 కరోనా కేసులు కూడా జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోనే నమోదైనట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. నేడు నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో గుర్తించిన కరోనా పాజిటివ్ కేసుల మొత్తం 1,107 కు చేరుకుంది.
తెలంగాణలో సోమవారం కొత్తగా మరో 3 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మూడు కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనివేనని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1085కు చేరింది.
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి తెలంగాణలో ఏరోజుకు ఆరోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నప్పటికీ.. చాలా రోజుల తర్వాత శనివారం మాత్రం కొత్తగా వెలుగుచూసిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కే పరిమితమవడం విశేషం.
తెలంగాణలో శుక్రవారం 13 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 983కు చేరింది ఆయన అన్నారు.
కరోనా వైరస్ నివారణ కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే రోగుల చికిత్స కోసం ఉపయోగిస్తున్న వైద్యపరికరాలు, మందులను వ్యాపార సంస్థలు బ్లాక్ మార్కెట్ చేయకుండా నియంత్రించాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రానికి విజ్ఞప్తిచేశారు.
కరోనావైరస్కి (Coronavirus) వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న పోరాటంలో రానున్న రెండు వారాలు చాలా కీలకమైనవి అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ (Union health minister Harshavardhan) అన్నారు.
మంత్రి మల్లారెడ్డిపై మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి పలు సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి మల్లా రెడ్డి కార్మిక శాఖ మంత్రిగా ఉంటూనే కార్మికుల పొట్టకొట్టడంతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరించారని మల్లా రెడ్డిపై నాయిని నర్సింహా రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
గుడిసెల్లో ఉండేవారికి, ప్లాస్టిక్ కవర్లనే నివాసంగా ఏర్పాటు చేసుకుని ఉంటున్న వారికే ముందుగా డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. 500 డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ కోసం సిద్ధమవుతున్నాయని మంత్రి చెప్పారు.
మంత్రి పదవి మీరు పెట్టిన భిక్ష. మీరే హక్కుదారులు. నా కారులో మీరు పెట్రోలు పోస్తే నేను తిరుగుతున్నాను అనే విషయాన్ని ప్రతీక్షణం గుర్తుపెట్టుకొని పనిచేస్తున్నానని మంత్రి ఈటల వ్యాఖ్యానించారు. హుజురాబాద్‌లో "పట్టణ ప్రగతి" కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.