ఐపీఎల్ (IPL 2020) 13వ సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK).. ఆల్‌రౌండ్‌షోతో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) పై 20 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ధోని సేన.. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 13 సీజన్లో ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై రథసారధి మహేంద్ర సింగ్ ధోని (Dhoni) ప్రవర్తన పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
వీలుచిక్కినప్పుడల్లా తాను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) మ్యాచ్‌లు చూస్తానని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (CP Sajjanar) తెలిపారు. పనిలో బిజీగా ఉండటం వల్ల రెగ్యూలర్‌గా మ్యాచ్‌లు చూడటం వీలుకాదన్నారు.
ఐపీఎల్ 2020 లో 14 వ మ్యాచులో మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ టీమ్, డేవిడ్ వార్నర్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. ఈ మ్యాచులో హైదరాబాద్ జట్టు చెన్నైను 7 పరుగుల తేడాతో ఓడించింది. చిత్రాల ద్వారా ఈ మ్యాచ్ విశేషాలు తెలుసుకుందాం.
CSK vs SRH match, IPL 2020: దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ( Chennai Super Kings ) సన్‌రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) 7 పరుగుల తేడాతో గెలిచి ఈ సీజన్లో మరో విజయం సొంతం చేసుకుంది. దీంతో IPL 2020లో ఇప్పటివరకు మొత్తం 4 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్ వార్నర్ జట్టు రెండు మ్యాచ్‌లో విజయం సాధించినట్టయింది.
CSK captain MS Dhoni IPL records: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో ఐపిఎల్ రికార్డు వచ్చి చేరింది. శుక్రవారం రాత్రి దుబాయ్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల ( CSK vs SRH match ) మధ్య జరిగిన మ్యాచ్‌తో ధోనీ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటివరకు సురేష్ రైనా పేరిట ఉన్న అత్యధిక ఐపిఎల్ మ్యాచ్‌ల రికార్డును ధోనీ ( MS Dhoni breaks Suresh Raina's record ) అధిగమించేశాడు.
SRH vs CSK match interesting facts: ఐపిఎల్ 2020లో భాగంగా దుబాయి స్టేడియం వేదికగా జరగనున్న నేడు శుక్రవారం జరగనున్న మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టేన్సీలోని Chennai Super Kings, డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని Sunrisers Hyderabad జట్లు తలపడనున్నాయి. కెప్టేన్ డేవిడ్ వార్నర్ ( David Warner ), జానీ బెయిర్‌స్టో ( Jonny Bairstow ) బాగానే ఆడినప్పటికీ.. 3వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన మనీష్ పాండే ( Manish Pandey ) ఓపెనర్లకు అండగా నిలుస్తూ ఆటకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్‌లోనే ఆటను బ్యాలెన్స్ చేసే ఆటగాళ్లు లేని లోటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని వేధిస్తోంది.
ఐపీఎల్ 13వ సీజన్ లో మొదటి 10 మ్యాచులు పూర్తయ్యాయి. ఇందులో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మ్యాచులు అత్యంత ఆసక్తికరంగా సాగాయి. యూఏఈ లో జరుగుతున్న ఈ మ్యాచుల్లో ఎవరు గెలుస్తారో అనేది చివరి బంతి వరకు తెలియడం లేదు. కొన్ని మ్యాచులు సూపర్ ఓవర్ కు ముందు గానీ తేలడం లేదు. అలా ఇప్పటి వరకు జరిగిన 10 మ్యాచుల్లో ఆసక్తికరమైన అంశాలు ఇవే !
భారత దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ తర్వాత ఆ స్థానం నీదేనని సంజూ శాంసన్‌కు తాను ఎప్పుడో చెప్పానంటూ శశిథరూర్ చేసిన కామెంట్‌పై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తనదైన శైలి (Gautam Gambhir slams Shashi Tharoor)లో బదులిచ్చాడు.
భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలీస్సా హేలీ (Alyssa Healy breaks Dhonis record of most dismissals) అధిగమించింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఈ ఘనత సాధించింది అలీస్సా హేలీ.
`CSK vs DC match review: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీకి ( MS Dhoni ) మళ్లీ ట్రబుల్స్ మొదలయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఐపిఎల్ టోర్నమెంట్లో వరుసగా రెండో మ్యాచ్ కూడా ఓడిపోయింది. ఐపిఎల్ 2020 ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) జట్టుపై ఘన విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super kings ) జట్టుకు ఆ తర్వాత రెండు మ్యాచుల్లోనూ ఓటమే మిగిలింది.
IPL 2020లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌పై జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ( CSK ) 16 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఓవైపు రాజస్థాన్ రాయల్స్ ( RR ) విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సిన అవసరం ఉందని తెలిసినా.. సిఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని 7వ స్థానంలో బ్యాటింగ్‌కు ( MS Dhoni ) రావడం ఏంటంటూ ధోనీపై సీనియర్ క్రికెటర్స్ నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తాయి.
ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ పృథ్వీ షా అద్భుతమైన అర్థసెంచరీతో రాణించడంతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ) బౌలర్లు అదరొట్టేయడంతో మహేంద్ర సింగ్ ధోనీ ( Mahendra Singh Dhoni ) సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కోల్పోవాల్సి వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.