AP BJP New Chief: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో పురంధేశ్వరి నేతృత్వంలో బీజేపీ మంచి ఫలితానే సాధించింది. అంతేకాదు ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నేత్రుత్వంలో పొత్తు కుదరడంలో కీ రోల్ పోషించారు. తాజాగా ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించేందకు బీజేపీ రంగం సిద్ధం చేస్తుందా అంటే ఔననే అంటున్నాయి ఏపీ బీజేపీ వర్గాలు.
YS Sharmila Fire On CM Chandrababu: వరదల నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి సహాయం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
Narendra Modi Enquired About Telangana Floods: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ప్రధానమంత్రి మోదీ ఆరా తీశారు. సహాయ చర్యలు ఎలా సాగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు.
Narendra Modi: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాం కూలిపోవడం మహారాష్ట్రలో పెనుదుమారంగా మారింది. ముఖ్యంగా మరాఠాలు చత్రపతిని శివాజీని తమ ఆరాధ్య దైవంగా కొలుచుకుంటారు. ఈనేపథ్యంలో అపోసిషన్ నేతలు సైతం.. ఈ ఘటనను తీవ్రంగా ఎండగడుతున్నారు.
Ram Madhav: ‘ఆర్టికల్ 370’ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల నగారా మోగింది. దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీలోకి మరోసారి రామ్ మాధవ్ ఎంట్రీ ఇవ్వడం కీలకంగా మారింది.
VIPs Rakhi Narendra Modi KTR Celebrations: రాజకీయాల్లో చాలా బిజీ ఉండే నాయకులు రాఖీ పండుగలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, తెలుగు రాష్ట్రాలు సీఎంలు చంద్రబాబు, రేవతంత్ రెడ్డి తదితరులు రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు.
Independence Day 2024 Celebrations In New Delhi: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. వేడుకల్లో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Independence day 2024: దేశ వ్యాప్తంగా 78 వ ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధానిమోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ క్రమంలో ఆయన వేసుకున్న తలపాగ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Etela First Speech in Parliament: ఈటల రాజేందర్ .. తెలంగాణలోని మల్కాజ్ గిరి నుంచి బీజేపీ తరుపున ఎంపీగా ఎన్నికయ్యారు. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత పార్లమెంట్ లో తొలి స్పీచ్ ఇచ్చారు. ఈ స్పీచ్ పై నరేంద్ర మోడీ సహా బీజేపీ నేతలు మెచ్చుకున్నారు.
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లను నియమించింది. మరోవైపు పార్లమెంటులో కీలకమైన ప్రభుత్వ విప్ పదవిలను భర్తీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా భారతీయ జనతా పార్టీ లోక్ సభలో ప్రభుత్వ విప్ పదవిని డాక్టర్ సంజయ్ జైస్వాల్ ను నియమించింది. ఈయనతో పాటు 16 మంది లోక్ సభ ఎంపీలకు విప్ పదవిలను కట్టబెట్టింది.
National Pension Sceme: మూడు రోజుల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను లోక్ సభలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా పలు కీలక ప్రకటనలు చేశారు. అందులో నేషనల్ పెన్షన్ స్కీమ్ పథకంలో పలు మార్పులు చేశారు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు మీ కోసం..
Parliament Budget Sessions: ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి అధికార, ప్రతిక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా కౌంటర్లు, ఎన్ కౌంటర్లతో సభలు దద్ధరిల్లుతున్నాయి. అంతేకాదు ప్రతిపక్షాలు .. కేంద్ర బడ్జెట్ పై పెదవి విరవడంతో పాటు నరేంద్ర మోడీకి కౌంటర్ ఇచ్చేలా పార్లమెంట్ లో వ్యూహాలు రచిస్తున్నాయి.
Parliament Session: కేంద్రంలో వరుసగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలో వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్తగా కొలువు దీరిన తర్వాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ఈ సమావేశాల్లో ప్రవేవ పెట్టనున్నారు. ఈ రోజు ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఆగష్టు 12 వరకు కొనసాగుతాయి.
Joe Biden: అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు. నిన్నటి వరకు డెమోక్రటివ్ పార్టీ తరుపున రెండోసారి అధ్యక్ష బరిలో దిగిన జై బెడైన్ ఎన్నికలకు మరో నాలుగు నెలలు ముందుగా వైదొలగడం అమెరికా రాజకీయాల్లో కాక రేపుతుంది.
Owaisi Vs KCR: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శతృవులు ఉండరని చెబుతూ ఉంటారు. ఒకప్పుడు ఒకరినొనకరు తిట్టు కున్న రాజకీయ నేతలు.. రాజకీయ అవసరం ఏర్పడితే.. ఒకరినొకరు ఆలింగనాలు చేసుకున్న సందర్భాలు కోకోల్లలు. తాజాగా మొన్నటి వరకు కేసీఆర్ తో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఎంఐఎం ఛీఫ్..ఆ పార్టీ అధికారంలోంచి దిగగానే.. వెంటనే ప్లేటు మార్చి కేసీఆర్ పై రెచ్చిపోతున్నాడు.
Anant Ambani: అంబానీ ఇంట్లో పెళ్లి సందడి అంటే మాములు విషయం కాదు. మన దేశంలో అత్యంత కుబేరుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆకాశమంత పందిరి.. భూదేవి అంత అరుగు వేసి ఈ పెళ్లిని కనీవినీ ఎరగని రీతిలో జరిగింది. ఈ పెళ్లిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు, సినీ, క్రీడా, మీడియా ఇలా వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.
BJP: 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అన్ని అబ్ కీ బార్ 400 పార్ అన్న నినాదం వర్కౌట్ కాలేదు. వాళ్లు చెప్పిన దాని కన్నా.. దాదాపు 100 సీట్లు తక్కువగా వచ్చాయి. ఇక ఎన్నికల తర్వాత జరిగిన ఉప ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలను అందుకున్నాయి.
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ క్యాండిడేట్ అయిన డొనాల్డ్ ట్రంప్ పై ఎన్నికల ర్యాలీలో కాల్పులు జరిగిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ప్రపంచ అగ్ర రాజ్యాధినేతగా పనిచేసిన మాజీ ప్రెసిడెంట్ పై జరిగిన ఈ ఘటనపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.