Telangana New Ration Cards: తెలంగాణ ప్రభుత్వం కొత్త కార్డుల జారీకి రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ నియమ నిబంధనలు రూపొందిస్తోంది. త్వరలోనే ఆ కార్డులు ఇచ్చే అవకాశం ఉంది.
PM Selfie Points at Ration Shops: ప్రధాని మోదీ సెల్ఫీ పాయింట్లపై తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతుండగా తాజాగా ఓ ముఖ్యమంత్రి అవి అవసరం లేదని చెప్పారు. దీనివలన చాలా ఖర్చు అవుతుందని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయం కోసం అలా ఫొటోలు వాడడం సరికాదని చెప్పారు.
Ration Dealers Strike: రాష్ట్రంలో అన్నార్థులు ఉండొద్దని, ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే గొప్ప సంకల్పంతో కేసీఆర్ సర్కార్ పేదలకు రేషన్ పంపిణీ చేపడుతోందని, సంవత్సరానికి వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తూ నాణ్యమైన, పోషక విలువలు ఉన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
Why Fair Price Shops on Strike: తమ పరిస్థితి రాన్రాను మరింత దయనీయంగా, అగమ్య గోచరంగా తయారైందని రేషన్ డీలర్స్ ఫెడరేషన్ ఆవేదన వ్యక్తంచేసింది. మానవతా దృక్పథంతో తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని తమ డిమాండ్లను పరిష్కరించాల్సిందిగా అనేకసార్లు కేంద్రాన్ని కోరినప్పటికీ.. తమ వ్యయ ప్రయాసలన్నీ వృధా అయ్యాయి.
Free Rice Scheme: చైనాలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరగడానికి కారణమైన ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ కేసులు ఇండియాలోనూ నమోదైన నేపథ్యంలో భారత ప్రభుత్వం సైతం కొవిడ్ కేసులపై అప్రమత్తమైంది. కేంద్రం ఉచిత రేషన్ పథకాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒక విధంగా ప్రభుత్వం అందించే రేషన్ పైనే ఆధారపడి బతికే బడుగు జీవులకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఊరటనిచ్చింది.
TRS MLC Kavitha : కేంద్ర మంత్రులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆసరా ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
Photo War: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ రోజు రోజుకు ముదురుతోంది. ఇప్పటివరకు పథకాలపై ఇరు పార్టీల నేతల మధ్య ఆరోపణలు సాగుతుండగా.. తాజాగా ఫోటో, ఫ్లెక్సీ రచ్చ సాగుతోంది.
FM Nirmala Sitharaman : కామారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి నిర్మల.. రేషన్ దుకాణాల వద్ద ప్రధాని మోదీ ఫోటోలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.
New ration cards in telangana: హైదరాబాద్: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు మంజూరు చేస్తారా అని ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ సర్కారు ఎట్టకేలకు గుడ్ న్యూస్ (Good news) చెప్పింది. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఇకమీదట రేషన్ షాపులు కనిపించకుండా పోతున్నాయా ? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు పౌరసరఫరాల శాఖ అధికారులు. రాష్ట్రంలో బియ్యం, ఇతర సరకులు లబ్దిదారులకు అందకుండా పక్కదారి పడుతున్నాయని, వాటిని చెక్ పెట్టేందుకే రేషన్ షాపులకు బదులు నగదు బదిలీ (డీబీటీ-డిపాజిట్ ఆఫ్ మనీ) ప్రవేశపెడుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.