హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కొత్త సినిమా "రేస్ 3" విడుదల అవుతున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలపాలని భావించారు.
హుటాహుటిన అక్కడికి చేరుకున్న ముంబై పోలీసులు సల్మాన్‌ని కట్టుదిట్టమైన భద్రత మధ్య అంతా సినిమాలో ఓ సన్నివేశం మాదిరిగా యుద్ధప్రాతిపదికన ఇంటికి తీసుకెళ్లిపోయారు
బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్‌కి భారీ భద్రత కల్పించారు ముంబై పోలీసులు. కృష్ణ జింక వేట కేసుకు సంబంధించిన విచారణ కోసం ఇటీవల సల్మాన్ ఖాన్ జోధ్‌పూర్ కోర్టుకి హాజరైన సంగతి తెలిసిందే. మరో కేసులో ఇదే కోర్టుకు హాజరైన లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగ్‌స్టర్ సల్మాన్ ఖాన్ని చంపేస్తానని బెదిరింపులకి పాల్పడిన నేపథ్యంలోనే సల్మాన్‌కి భద్రతని కట్టుదిట్టంచేశారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ రేస్ 3 సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. బుధవారం ఫిలిం సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లిన ముంబై పోలీసులు...
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సినిమా 'టైగర్ జిందా హై' శుక్రవారం డిసెంబర్ 22వ తేదీ థియేటర్లలో విడుదల అయ్యింది. ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.
వినోద, క్రీడా ప్రపంచంలో ఈ సంవత్సరం అత్యధిక ఆదాయం పొందిన భారతీయ సెలబ్రిటీల జాబితాని ఇటీవలే ఫోర్బ్స్ పత్రిక ప్రకటించింది. అందులో రూ. 232.83 కోట్ల రూపాయల ఆదాయంతో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తొలిస్థానంలో ఉండడం విశేషం. ఆయన తర్వాతి స్థానాల్లో షారుఖ్ ఖాన్ (రూ.170.50 కోట్లు), విరాట్ కోహ్లీ (రూ.170.50 కోట్లు), అక్షయ్ కుమార్ (రూ.98.25 కోట్లు) ఉన్నారు. ఇక ఈ జాబితాలో పలువురు దక్షిణాది నటులకు కూడా చోటు దక్కడం విశేషం. ముఖ్యంగా ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి నటులు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం గమనార్హం.
రాణీ ముఖర్జీ కుమార్తె అదిరా పుట్టినరోజు పార్టీకి వెళ్లిన బాలీవుడ్ ప్రముఖులందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా... అదే పార్టీకి వెళ్లిన కత్రినా మాత్రం ఓ ముద్దులొలికే చిన్న బాలుడితో ఆటల్లో మునిగిపోయారట
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.