జాతీయ స్థాయి ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశపరీక్షలు జేఈఈ ( JEE ), నీట్ ( NEET )లను కేంద్రం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. ఈ మేరకు ఎన్టీఏ అడ్మిట్ కార్డులను సైతం వెబ్సైట్లో ఉంచామని, దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా డౌన్లోడ్ చేసుకోవాలని శుక్రవారం సూచించింది.
కరోనావైరస్ కట్టడికి లాక్డౌన్ విధించగా.. ఆ లాక్డౌన్ని ఎప్పుడు ఎత్తివేస్తారో స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితి లేనందున తెలంగాణలో నిర్వహించబోయే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 2020 ( Telangana SSC exams 2020 ) విషయంలో తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
తాను అధికారంలోకి వస్తే.. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం (English medium in govt schools) విద్యను ప్రవేశపెట్టి అక్కడి విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కునేందుకు సిద్ధం చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( CM YS Jaganmohan Reddy).. అధికారంలో వచ్చాకా ఆ హామీని నిలబెట్టుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు.
చిన్నారులను పాఠశాలకు తీసుకెళ్లే స్కూల్ వ్యానుకు నిప్పంటుకోవడంతో అందులో ప్రయాణిస్తోన్న వారిలో నలుగురు విద్యార్థులు మృత్యువాత పడిన దుర్ఘటన పంజాబ్లోని సంగ్రూర్కి సమీపంలోని లొంగోవాల్ పట్టణంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
ఎక్కాలు కూడా రాని మాస్టార్ల చేతిలో రేపటి పౌరుల 'భవిష్యత్'.. ఈ విషయం గురించి మాటల్లో చెప్పడం కంటే.. దృశ్యరూపంలో చూస్తేనే బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియోపై ఓ లుక్కేయండి..
ఏపీ కేబినెట్ సమావేశంలో అమ్మఒడి పథకానికి ఆమోదం లభించిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. దాదాపు మూడున్నర గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అందరు విద్యార్థులకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని మంత్రి తెలిపారు. తల్లి లేని పిల్లల విషయంలో వారి సంరక్షకులకు ఆ ఆర్థిక సహాయాన్ని అందిస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.