Narayana College Student Suicide Attempt: హైదరాబాద్‌లోని అంబర్‌పేట నారాయణ కాలేజీకి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. యాజమాన్యం టీసీ ఇవ్వకుండా వేధిస్తున్నందువల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు అతని స్నేహితులు చెబుతున్నారు.
Nalgonda Police Inhumanity: తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి పట్ల నల్గొండ పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. గాయాలపాలైన ఆ వ్యక్తిని కారు డిక్కీలో కుక్కి ఆసుపత్రికి తరలించారు.
Telangana Congress: తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా మారింది. ఎవరు పార్టీలోకి వస్తున్నారో..ఎవరు పార్టీని ఎప్పుడు వీడుతారో తెలియని గందరగోళం నెలకొంది.
నీతి ఆయోగ్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ పదునైన విమర్శలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇవాళ జరిగిన నీతిఆయోగ్ సమావేశానికి కేసీఆర్ హాజరుకాలేదు. దీనిపై స్పందించిన నీతి ఆయోగ్ కేసీఆర్ నిర్ణయం దురదృష్టకరమని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నతస్థాయి సమావేశానికి దూరంగా ఉండటం సరికాదని పేర్కొంది.
Rain Alert Telangana: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒరిస్సా తీరం దాటి పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం ఈ రోజు వాయువ్య బంగాళాఖాతంలోని ఒరిస్సా, పశ్చిమబెంగాల్ తీరంలో కొనసాగుతూ వుంది.
Three Commits Suicide in Patancheru: పటాన్చెరులో ముగ్గురి ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అక్రమ సంబంధమే ఆత్మహత్యలకు కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సికింద్రాబాద్ మారేడుపల్లి ఎస్సై వినయ్ కుమార్‌పై హత్యాయత్నం ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. తెల్లవారుజామున 2.50 గం. ప్రాంతంలో పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న వినయ్ కుమార్‌పై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. కత్తులతో ఆయన్ను పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఎస్సైని వెంటనే గీత నర్సింగ్ హోమ్‌కు తరలించారు. ప్రస్తుతం ఎస్సై ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
Telangana Politics : శ్రావణమాసం వచ్చిందంటే వరుస పండుగలొస్తాయి. పెళ్లిళ్ల సీజన్ స్టార్టవుతుంది. కానీ ఇప్పుడు శ్రావణం కోసం కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఎదురుచూస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలకు షాకివ్వడానికి శ్రావణం రావాల్సిందే అంటున్నాయి. ఇంతకీ తెలంగాణ రాజకీయాల్లో ఆ మాసంలో ఏం జరుగబోతోంది . ఈ నెల 28 నుంచి రాష్ట్ర రాజకీయ తెరపై వచ్చే మార్పులేంటి
Mandals In Telangana: తెలంగాణలో మరికొన్ని కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా మరో 13 మండలాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది.
Aara Survey: తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలైతే ఏ పార్టీ గెలుస్తుంది ? అధికార టీఆర్ఎస్కు జనం మళ్లీ పట్టం కడతారా ? బీజేపీ టీఆర్ఎస్ను ఢీకొట్టి అధికారం చేజిక్కించుకుంటుందా ? కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ? ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది ఆరా సర్వే.
Centre Shock to KCR: తెలంగాణ సర్కార్‌కు కేంద్రం షాకిచ్చింది. ఓపెన్ మార్కెట్ నుంచి సమీకరించ తలపెట్టిన రూ.52,167 కోట్ల రుణాల్లోరూ.19 వేల కోట్లకు కేంద్రం కోత పెట్టింది.
Rajendranagar illegal constructions: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో అక్రమ కట్టడాలపై అధికారులు కన్నెర్ర చేశారు. మైలార్దేవ్ పల్లిలోని వినాయక నగర్ కాలనీలో ఉన్న సర్వే నెంబర్ 115లో అనుమతులు లేకుండా నిర్మాణలు చేస్తున్నట్టు సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని అక్రమ కట్టడాన్ని సిబ్బందితో కూల్చి వేయించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.