YCP targeted BRS party: ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని వైసీపీ పార్టీ టార్గెట్ చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
KTR VS KISHAN REDDY: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. అధికారమే లక్ష్యంగా తెలంగాణలో దూకుడు పెంచిన కమలనాధులు.. కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రానికి క్యూ కడుతున్న కేంద్ర మంత్రులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు.
TRS VS MIM: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుపుకునిపోయోలా వ్యూహాలు రచిస్తున్నారు. సొంత రాష్ట్రంలో ఆయనకు షాకిచ్చే పరిణామాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
KCR NATIONAL POLITICS: దేశ్ కీ నేత కేసీఆర్.. ఇది కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, కార్యకర్తలు చేస్తున్న నినాదం. తెలంగాణలో ఈ వాయిస్ వినిపించడమే కాదు ఢిల్లీ, ముంబైలోనే దేశ్ కీ నేత కేసీఆర్ బ్యానర్లు వెలిశాయి.
Kcr National Politics: కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. బీజేపీ ముక్త భారత్ అంటూ నినదిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలు చేశారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లి ముఖ్యమంత్రులు, పలు పార్టీల అధినేతలో చర్చలు జరిపారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే తన లక్ష్యమని చెబుతూ వస్తున్నారు. అయితే ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలతో కేసీఆర్ జాతీయ రాజకీయాలు కాంగ్రెస్ కూటమి వైపు కదులుతున్నట్లుగా కనిపిస్తోంది.
Telangana Politics: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీపై మొదటి నుంచి దూకుడుగా పోరాడుతున్నారు రేవంత్ రెడ్డి. టీడీపీలో ఉన్నప్పుడే కేసీఆర్ ఫ్యామిలీని ఓ రేంజ్ లో ఆయన టార్గెట్ చేశారు. ఓటుకు నోటు కేసులో జైలుకు కూడా వెళ్లారు. జైలు నుంచి వచ్చాక కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు రేవంత్ రెడ్డి.
Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన లిక్కర్ స్కాంలో సోమవారం నుంచి ఢిల్లీలో విచారణ జరపనున్నారు ఈడీ అధికారులు. ఈ కేసులో రాజకీయ ప్రముఖుల లింకులు తేలడంతో వాళ్లు ఎవరన్నది తేల్చే పనిలో ఈడీ ఉందని తెలుస్తోంది.
TARGET KCR FAMILY: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? కల్వకుంట్ల కుటుంబ సభ్యుల బినామీల చిట్టా కేంద్ర దర్యాప్తు సంస్థల చేతిలో ఉందా? బడాబాబులు జైలుకు వెళ్లడం తప్పదా? అంటే తెలంగాణలో తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. కేంద్ర మంత్రులు సహా తెలంగాణ బీజేపీ నేతలు పదేపదే చెబుతున్నట్లుగానే కేసీఆర్ కుటుంబానికి చెందిన ముఖ్యులు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమంటున్నారు.
TARGET KCR FAMILY: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? కల్వకుంట్ల కుటుంబ సభ్యుల బినామీల చిట్టా కేంద్ర దర్యాప్తు సంస్థల చేతిలో ఉందా? బడాబాబులు జైలుకు వెళ్లడం తప్పదా? అంటే తెలంగాణలో తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది.
TARGET KCR : సీబీఐ కేసులు.. ఈడీ దాడులు.. ఐటీ సోదాలు.. ఎన్ఐఎ తనిఖీలు.. ఈ మాటలు కొన్ని రోజులుగా తెలంగాణలో కామన్ గా మారిపోయాయి. రోజు తెలంగాణ రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు జరుగుతున్నాయి.
NIA RAIDS: తెలంగాణలో ఆదివారం జరిగిన ఎన్ఐఏ దాడులు తీవ్ర కలకలం రేపాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో ఎన్ఐఏ బృందాలు తెలంగాణాలోని 38 ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో చోట సోదాలు నిర్వహించాయి. ఎన్ఐఏతో పాటు జీఎస్టీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. పీఎఫ్ఐ కార్యకలాపాల ముసుగులో ఉగ్రవాదశిక్షణ ఇస్తూ దేశవ్యాప్తంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్ర చేస్తున్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేసింది ఎన్ఐఏ. నిజామాబాద్‌లోనే 23 చోట్ల, జగిత్యాలలో 7, హైదరాబాద్‌లో 4, నిర్మల్‌లో 2, ఆదిలాబాద్, కరీంనగర్‌లలో తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో 8.31లక్షల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు
KCR U TURN: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. దసరా తర్వాత అసెంబ్లీని సీఎం కేసీఆర్ రద్దు చేస్తారనే చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని తెలుస్తోంది. అసెంబ్లీని రద్దు చేస్తే కేంద్ర సర్కార్ తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం ఉండటమే ఇందుకు కారణమంటున్నారు.
Etela Critises KCR National Politics: సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన వ్యక్తి దేశ ప్రజల నమ్మకాన్ని కూడగడుతారా అని ప్రశ్నించారు.
Congress Candidate in Munugode By Election : మునుగోడు ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతికే టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించింది.
Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తుపై కొన్ని రోజులుగా చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ తో పొత్తు సమస్యే లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నా.. జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిపి పోటే చేసే అవకాశాలు ఉన్నాయనే వాదన ఉంది.
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మంగళవారం నుండి మొదలుకానున్నాయి. గత మార్చిలో చివరి సారిగా అసెంబ్లీ సమావేశమైంది. ఆరు నెలలు ముగుస్తుండటంతో అసెంబ్లీని నిర్వహిస్తోంది కేసీఆర్ ప్రభుత్వం.శాసనమండలి కూడా మంగళవారమే ప్రారంభం కానుంది.
Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం వలసల సీజన్ నడుస్తోంది. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీయడంతో ఎప్పుడు ఎవరూ ఆ పార్టీలో చేరుతారనే తెలియని పరిస్థితి నెలకొంది. బీజేపీ జాతీయ నేతలు తెలంగాణకు క్యూ కడుతుండటంతో వలసలు పెద్ద ఎత్తున ఉంటాయనే ప్రచారం సాగుతోంది.
Telangana Elections:ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో దాదాపు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరగబోవనని చెబుతూనే సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా సర్వే వివరాలను నేతల ముందు ఉంచారు.
Photo War: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ రోజు రోజుకు ముదురుతోంది. ఇప్పటివరకు పథకాలపై ఇరు పార్టీల నేతల మధ్య ఆరోపణలు సాగుతుండగా.. తాజాగా ఫోటో, ఫ్లెక్సీ రచ్చ సాగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.