Bajaj Pulsar N125 Vs Hero Xtreme 125R: ప్రస్తుతం మార్కెట్‌లో బజాజ్ పల్సర్ N125 హవా కొనసాగుతోంది. ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలోనే రావడం వల్ల చాలా మంది మిడిల్ క్లాస్ వినియోగదారులు కూడా ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే దీనికి పోటీగా గతంలో విడుదలైన హీరో ఎక్స్‌ట్రీమ్ 125R కొనసాగుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ రెండు మోటర్‌సైకిల్స్ మధ్య మంచి పోటీ కొనసాగుతోంది. అయితే ఈ రెండు స్కూటర్స్‌లో ఏది బెస్టో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్ కలిగిన బజాజ్ పల్సర్ N125, హీరో ఎక్స్‌ట్రీమ్ 125R మోటర్‌సైకిల్స్ రెండు 125cc ఇంజన్‌తో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉన్నాయి. అయితే ఎప్పటి నుంచో ఈ రెండు బైక్స్‌లో ఎదో ఒకటి కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇందులో ఎది బెస్టో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇక ఈ రెండు బైక్స్‌కి సంబంధించిన మోటర్‌సైకిల్స్ వివరాల్లోకి వెళితే.. బజాజ్ పల్సర్ N125 బైక్ మోస్ట్ పవర్‌పుల్ 125cc ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇంజన్ 12 hp పవర్‌ను ఉత్పత్తి చేయడమే కాకుండా 11 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. హీరో ఎక్స్‌ట్రీమ్ 125R మోటర్‌సైకిల్‌కి సంబంధించిన మోటర్‌సైకిల్ వివరాల్లోకి వెళితే.. ఇది 125cc ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చింది. దీని ఇంజన్ 11.5 hp పవర్‌తో పాటు 10.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయబోతున్నట్లు తెలిపింది. దూరప్రయాణాలు చేసేవారికి ఈ బైక్ చాలా బాగుంటుంది. ఈ రెండు బైక్స్ ధర సరిసమానంగా ఉంటాయి.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత
ఇక ఈ రెండు బైక్స్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే.. ఈ రెండు మోటర్‌సైకిల్స్‌లో డిజిటల్ LCD స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా కాల్ సపోర్ట్‌తో పాటు SMS, నోటిఫికేషన్ వార్నింగ్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ సపోర్ట్‌ను అందిస్తోంది. అలాగే హీరో ఎక్స్‌ట్రీమ్ 125R మోటర్‌సైకిల్‌లో స్పెషల్ USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌ను అందిస్తోంది. అయితే పల్సర్ N125 మోటర్‌సైకిల్‌లో ఈ ఫీచర్ లేదు.. కానీ ఈ స్కూటర్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే అధునాత ఫీచర్స్ కావాలనుకునేవారికి హీరో Xtreme 125R బైక్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి