Dead Cheap Pebble Cosmos Smartwatch: భారతదేశంలో మొట్ట మొదటి సారిగా లాంచ్ అయిన స్మార్ట్ వాచ్‌ల్లో పెబుల్ కంపెనీకి చెందిన వాచ్ ఒకటి. ఈ వాచ్ చూడడానికి అచ్చం యాపిల్ స్మార్ట్ వాచ్‌ను పోలి ఉంటుంది. అయితే రేటు విషయానికొస్తే యాపిల్ స్మార్ట్ వాచ్ కంటే చాలా తక్కువ ధరకే లభిస్తుంది. ఫిట్‌బిట్ పెబుల్ బ్రాండ్ కంపెనీ మోడల్‌తో ప్రస్తుతం భారత మార్కెట్‌లో విక్రయిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ అన్ని వాచ్‌ల కాకుండా శక్తివంతమైన ఫీచర్లు ఇందులో ఉంటాయి. ఇక దీని బాడీ విషయానికొస్తే అద్భుతమైన డిజైన్‌తో కూడిన ఆపిల్ వాచ్ అల్ట్రా వంటి డిజైన్‌తో కంపెనీ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. అంతేకాకుండా కాస్మోస్ ఎంగేజ్ పేరుతో కూడా మార్కెట్‌లో విక్రయిస్తోంది కంపెనీ. అయితే పెబుల్ కాస్మోస్ ఎంగేజ్ ధర, ఫీచర్లను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పెబుల్ కాస్మోస్ ఎంగేజ్ ధర:
భారత మార్కెట్‌లో చాలా రకాల వాచ్‌లు లభిస్తున్నాయి. కానీ దీని ధర అన్ని వాచ్‌ల కంటే తక్కువగానే ఉంటుంది. యాపిల్ వాచ్‌ను పోలి ఉన్న ఈ వాచ్ ధర కేవలం మార్కెట్‌లో రూ.3,999 మాత్రమే లభిస్తోంది. అయితే ఇది అన్ని ఈ కామర్స్ వెబ్ సైట్స్‌తో పాటు అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా కొనుగోలు చేయోచ్చు.
కాస్మోస్ ఎంగేజ్ డిజైన్
ఈ నెల ప్రారంభంలోనే బుల్ ఫ్రాస్ట్ పేరుతో ఆపిల్ వాచ్ లాంటి బాడీని కలిగి వాచ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది కంపెనీ. ఇది చూడడానికి అచ్చం ఆపిల్ వాచ్ సిరీస్ 8 కలిగి ఉంటుంది. దీని డిజైన్ పూర్తి యాపిల్ వాచ్ అల్ట్రాను పోలి ఉంటుంది. కాబట్టి ఈ వాచ్‌నుకొనేందుకు వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
పెబుల్ కాస్మోస్ ఎంగేజ్ స్పెసిఫికేషన్‌లు:
పెబుల్ కాస్మోస్ ఎంగేజ్ స్మార్ట్ వాచ్ 600నిట్స్ బ్రైట్‌నెస్‌తో 1.95-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. కానీ అన్ని వాచ్‌లా కాకుండా OLED ప్యానెల్ ఫీచర్ ఇందులో అందుబాటులో లేదు. IP67-రేట్ ఉండడంతో వాటర్‌లో కూడా దీనిని సులభంగా వాడొచ్చు. ఇది ప్రత్యేకమైన సెన్సర్స్‌తో మార్కెట్‌లో విక్రయిస్తోంది. ఈ వాచ్ హృదయ స్పందన రేటు, నిద్ర పర్యవేక్షణ, బ్లూటూత్ కాలింగ్ వంటి చాలా రకాల ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఇది ప్రస్తుతం మూడు రంగులలో (ఆరెంజ్, స్టార్‌లైట్, మిడ్‌నైట్ బ్లాక్ , సెలెస్టియల్ బ్లూ) లభిస్తోంది. అయితే ఈ వాచ్‌ను iOS, Android ఫోన్స్‌కు కనెక్ట్ చేయవచ్చు.
Also Read: మూడు పెళ్లిళ్లు-మూడు పేర్లు, రెండో భర్తతో అలా ఉందని భార్యను దారుణంగా చంపిన మూడో భర్త
Also Read: Bandla Ganesh Tounge Slip: ధమాకా సక్సెస్ మీట్లో ‘బూతు’ జారిన బండ్ల.. ఇప్పుడేమో ఇలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook