Smart Phone Tricks: ఫోన్ పోగొట్టుకున్నారా, ఈ ట్రిక్స్ పాటిస్తే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేరు

Smart Phone Tricks: స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు అన్నీ ఫోన్‌లో‌నే నిక్షిప్తమై ఉంటున్నాయి. అందుకే ఫోన్ పోగొట్టుకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. అందుకే మీ కోసం కొన్ని ముఖ్యమైన సూచనలు

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 13, 2024, 05:26 PM IST
Smart Phone Tricks: ఫోన్ పోగొట్టుకున్నారా, ఈ ట్రిక్స్ పాటిస్తే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేరు

Smart Phone Tricks: స్మార్ట్‌ఫోన్ వినియోగం కంటే ముఖ్యమైంది ఫోన్ భద్రంగా ఉంచుకోవడం. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఫీచర్లతో ఫోన్ పోగొట్టుకున్నా చాలా సులభంగా లొకేషన్ ట్రాక్ చేయవచ్చు. అయితే అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయనంతవరకే లొకేషన్ ట్రాక్ అవుతుంది. మేం చెప్పే సూచనలు ఇక్కడే ఉపయోగపడతాయి. 

స్మార్ట్‌ఫోన్ పోయినప్పుడు దొంగిలించిన వ్యక్తి లేదా పోన్ దొరికిన వ్యక్తికి ముందుగా చేసేది ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం. దాంతో లొకేషన్ ట్రాక్ చేసేందుకు సాధ్యం కాదు. మరి అవతలి వ్యక్తి మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా చేయలేమా అంటే కచ్చితంగా చేయవచ్చు. దీనికి కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ సెట్టింగ్స్ సెట్ చేసుకుంటే మీ ఫోన్ ఛార్జింగ్ ఉన్నంతవరకూ ఆన్‌లోనే ఉండేట్టు చేయవచ్చు. తద్వారా లొకేషన్ ట్రాక్ చేయవచ్చు. మీరు ఈ సెట్టింగ్స్ సెట్ చేస్తే అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలంటే పిన్ లేదా పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అప్పుడే అది స్విచ్ ఆఫ్ అవుతుంది.

వాస్తవానికి ఈ ఫీచర్లు చాలా ఫోన్లలో ఉంటాయి. కానీ అందరికీ తెలియవు. ఈ ఫీచర్ ఒక్కటే కాదు చాలా సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి. ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ముఖ్యమైన ఫీచర్లలో ఒకటి Unlock to Power Off  ఫీచర్. అంటే అవతలి వ్యక్తి స్విచ్ ఆఫ్ చేయకుండా చేసే ఫీచర్.

దీనికోసం ముందు మీ ఆండ్రాయిడ్ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు అందులో ప్రైవసీ ఆప్షన్ క్లిక్ చేయాలి. ప్రైవసీ సెట్టింగ్స్ నుంచి Unlock to Power Off ఆప్షన్ ఎంచుకోవాలి. ఈ ఆప్షన్ కన్పించకపోతే సెర్చ్ బార్ ద్వారా గుర్తించవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లలో పైండ్ మై ఫోన్ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవాలి.

Also read: Amazon Sale 2024: అమెజాన్‌లో ఈ 5 ట్యాబ్‌లపై ఏకంగా 74 శాతం డిస్కౌంట్, లిమిటెడ్ ఆఫర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News