Huawei Vision Smart Screen 4 4K TV Price: స్మార్ట్‌టీవీలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌టీవీలు అతి తక్కువ ధరలకే లభించడంతో చాలా మంది మిడిల్ క్లాస్ కస్టమర్స్ కూడా వీటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే టెక్ కంపెనీలు కూడా గతంలో మార్కెట్‌లోకి లాంచ్ చేసిన మొబైల్స్‌ను అప్‌గ్రేడ్ వెర్షన్స్‌లో మళ్లీ విడుదల చేస్తూ వస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ టెక్ కంపెనీ Huawei కూడా మరో స్మార్ట్‌టీవీని మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇందులో ఎంతో శక్తివంతమైన AI ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు ఈ టీవీలో AIపై పనిచేసే హై-డెఫినిషన్ ప్రత్యేక కెమెరా కూడా లభిస్తోంది. కంపెనీ ఈ స్మార్ట్‌టీవీని వివిధ అంగుళాల వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ స్మార్ట్‌టీవీకి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం..
Huawei కంపెనీ ఈ Huawei Vision Smart Screen 4 4K TV స్మార్ట్‌టీవీని చైనాలో ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అలాగే ఈ టీవీలకు సంబంధించిన ధరలను కూడా అందుబాటులో ఉంచింది. మొదటి వేరియంట్ టీవీ రూ.60 వేల లోపే లభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మోడళ్ల వారిగా ధరలు చూస్తే.. 65 అంగుళాల మోడల్ ధర భారత కరెన్సీ ప్రకారం, ధర రూ.57,700లకు అందుబాటులో ఉంది. ఇక 75 అంగుళాల మోడల్ ధర దాదాపు రూ. 75,000 ఉండబోతున్నట్లు తెలుస్తోంది. టాప్ ఎండ్ మోడల్ ధర 86 అంగుళాల స్మార్ట్ టీవీ రూ. 1 లక్షలతో లభిస్తోంది.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
విజన్ స్మార్ట్ స్క్రీన్ 4 స్మార్ట్ టీవీ అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 1.5mm సన్నని బెజెల్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 98 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో లభిస్తోంది. ఈ టీవీని స్టీల్ ప్లేట్ మెటీరియల్‌తో తయారు చేసిన్నట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌టీవీని మైక్రాన్-గ్రేడ్ క్వార్ట్జ్ ఇసుకతో పాలిష్‌తో తయారు చేసిన్నట్లు తెలుస్తోంది. ఈ Huawei Vision Smart Screen 4 4K TV టీవీ కంపెనీ 4K ప్యానెల్ 2304 ఇంటెలిజెంట్ లైట్ కంట్రోల్ సెటప్‌లో అందిస్తోంది. దీంతో పాటు మరెన్నో కొత్త ఫీచర్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్:
ఈ Huawei Vision Smart Screen 4 4K TV స్మార్ట్‌టీవీ 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఈ టీవీ 4-కోర్ 'AI విజన్ చిప్ పై రన్ అవుతుంది. అలాగే చిప్‌సెట్ 4K 120 FPS డీకోడింగ్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో కంపెనీ Ai ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఏఐ సపోర్ట్‌తో చిప్‌సెట్ 1.6TNPU బూస్ట్‌ను చేసే సామర్థ్యం కలిగి ఉంది. దీని కారణంగా టీవీ సులభంగా బూట్ అవుతుంది. అలాగే వీడియో కాల్ పోర్ట్రెయిట్ ట్రాకింగ్ కోసం AI ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో చిప్ సూపర్-రిజల్యూషన్ టెక్నాలజీ కూడా లభిస్తోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి