Mahindra XEV 9e Price: మహీంద్రా నుంచి మరో రెండు కొత్త EV కార్లు.. ధర, ఫీచర్స్‌, స్పెషిఫికేషన్‌ వివరాలు..

Mahindra XEV 9e Price: త్వరలోనే మహీంద్రా కంపెనీ కొన్ని కొత్త ఎలక్ట్రిక్‌ కార్లను విడుదల చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 7, 2025, 02:47 PM IST
Mahindra XEV 9e Price: మహీంద్రా నుంచి మరో రెండు కొత్త EV కార్లు.. ధర, ఫీచర్స్‌, స్పెషిఫికేషన్‌ వివరాలు..

Mahindra XEV 9e Price:  ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా తమ కస్టమర్స్‌కి అద్భుతమైన గుడ్‌న్యూస్‌ అందించబోతోంది. అతి త్వరలోనే ఎంతో శక్తివంతమైన ఎలక్ట్రిక్‌ కార్లు విడుదల కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ కార్లు XEV 9eతో పాటు BE 6 పేర్లతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కార్లకు సంబంధించిన ధరలతో పాటు విడుదల తేదిల వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

త్వరలోనే విడుదల కాబోయే మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు అద్భుతమైన డిజైన్‌తో విడుదల కానున్నాయి. అంతేకాకుండా అద్భుతమైన మైలేజీతో విడుదల కానుంది. అయితే దీనిని కంపెనీ ఫిబ్రవరిలోని 14వ తేదిన అందుబాటులోకి లాంచ్‌ కానున్నాయి.  ఉదయం 9 గంటల  నుంచి ఫ్రీబుకింగ్‌ కూడా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మహీంద్రా XEV 9e కారు మొత్తం నాలుగు వేరియంట్స్‌లో విడుదల కానున్నాయి. దీని ధర రూ.21.90 లక్షల నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్స్‌ ఉండనున్నాయి. ఇక ఇందులోని టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ రూ.24.90 లక్షల నుంచి లభిస్తోంది. 

ఇక మహీంద్రా XEV 9e కారులోని టాప్‌ వేరియంట్‌ రూ.27.90 లక్షలకు లభించనుంది. ఇక ఇందులోనే టాప్‌టైర్‌ అనే మోడల్ రూ.30.50 లక్షలతో లభిస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన 79 kWh బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులోకి రానుంది. మహీంద్రా BE 6 కారు ఐదు వేరియంట్స్‌లో లభించనుంది. ఇందులోని బేస్‌ వేరియంట్‌ ధర రూ. 18.90 లక్షల నుంచి ప్రారంభం కాబోతోంది. ఇందులోని టాప్‌ వేరియంట్‌ రూ.26.90 లక్షలు ఉండబోతున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది ప్యాక్ త్రీ 79 kWh బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులోకి రానుంది.

Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరి 14న అధికారికంగా ప్రీ బుకింగ్‌ ప్రారంభించనుంది. అలాగే వీటి  డెలివరీలను ఆగస్టు 2025లో ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కార్లకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ మహీంద్రా BE కారు చూడడానికి XUV400 కారు లాగా ఉండబోతోంది. అంతేకాకుండా దీనిని కూడా INGLO ప్లాట్‌ఫామ్‌పై నిర్మించినట్లు తెలుస్తోంది. భద్రత పరంగా కూడా ఈ కార్లు మంచి రేటింగ్‌ను సంపాదించుకున్నట్లు సమాచారం.

Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News