Motorola G04 Price Down Suddenly: మిడిల్ రేంజ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లకు మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. ఎందుకంటే చాలామంది ఇలాంటి మొబైల్స్ ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అందులో చాలామంది ప్రీమియం ఫీచర్స్ ఎక్కువగా లభించే తక్కువ ధర మొబైల్స్‌ని ఎంచుకుంటున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కూడా ఇలాంటి మొబైల్స్‌ని ఎక్కువగా తయారుచేసి మార్కెట్లోకి వదులుతున్నాయి. ఇటీవలే మోటో నుంచి లాంచ్ అయిన G04 (Motorola G04) మోడల్ గొప్ప ప్రజాదరణ పొందింది.
అందుకే ఈ మొబైల్ విక్రయాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ పై ప్రత్యేకమైన డీల్‌ను ప్రారంభించింది. ఈ డిల్ లో భాగంగా అతి తక్కువ ధరకే ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తోంది. అయితే ఈ ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై ఉన్న ఆఫర్స్ ఏంటో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో మోటరోలా G04 (Motorola G04) స్మార్ట్ ఫోన్ పై ప్రత్యేక డీల్ ప్రారంభమైంది. ఈ డీల్‌లో భాగంగా దీనిపై స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ లభించడమే కాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.11000 కాగా.. ప్రత్యేక డీల్లో భాగంగా 27% తగ్గింపుతో రూ.7,999కే లభిస్తోంది. ఇక బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా ఈ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
అలాగే అన్ని UPI లావాదేవీల ద్వారా కూడా తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు ఈ మొబైల్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ వినియోగించి కొనుగోలు చేసే వారికి రూ.5,450 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో డిస్కౌంట్ ఆఫర్స్ అన్నీ పోను ఈ మొబైల్ కేవలం రూ.1,000లోపే పొందవచ్చు. ఈ బోనస్ అనేది ఎక్చేంజ్ చేసే పాత స్మార్ట్‌ఫోన్ కండీషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. కండీషన్ బాగుంటే పై డిస్కౌంట్ బోనస్ లభిస్తుంది.
మోటోరోలా G04 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు:
6.5" IPS LCD డిస్ప్లే
720 x 1600 పిక్సెల్‌ల రిజల్యూషన్
60Hz రిఫ్రెష్ రేటు
MediaTek Helio G37 Octa-core ప్రాసెసర్
64GB eMMC 5.1 నిల్వ
మైక్రో SD కార్డ్ స్లాట్
50MP ప్రధాన సెన్సార్
2MP డెప్త్ సెన్సార్ కెమెరా
5MP ఫ్రాంట్ కెమెరా
5000mAh బ్యాటరీ
10W ఫాస్ట్ ఛార్జింగ్
ఇతర ఫీచర్లు:
Android 12 ఆపరేటింగ్ సిస్టమ్
వై-ఫై, బ్లూటూత్ 5.0, GPS
3.5mm హెడ్‌ఫోన్ జాక్
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter