Oppo Enco Air 4 Pro Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Oppo నుంచి మరో గుడ్ న్యూస్.. ప్రీమియం ఫీచర్స్‌తో కూడి మరో ఇయర్‌బడ్‌ను లాంచ్ చేసింది. ఇది అద్భుతమైన ఆడియో సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ Oppo Enco Air 4 పేరుతో విడుదల చేసింది. ఈ ఇయర్‌బడ్‌లు ప్రీమియం 12.4 mm డ్రైవర్ సెటప్‌తో అందుబాటులోకి వచ్చాయి. ఇది AI నాయిస్ సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు కంపెనీ ఇందులో 43 గంటల బ్యాటరీ లైఫ్‌తో పాటు ప్రీమియం లుక్‌లో కనిపిస్తు ఉంటాయి. అయితే ఈ ఇయర్‌బడ్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రముఖ Oppo కంపెనీ ఈ Oppo Enco Air 4 Proని ఉక్రెయిన్‌తో పాటు చైనాలో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ ఇయర్‌బడ్స్‌కి సంబంధించిన మొదటి సేల్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 12.4mm డైనమిక్ డ్రైవర్ యూనిట్‌తో పాటు ప్రీమియం 20-20KHz ఫ్రీక్వెన్సీ సెటప్‌ను కలిగి ఉండబోతోంది. అంతేకాకుండా ఇవి బ్లూటూత్ 5.4లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా AAC/SBC కోడెక్‌లు, డ్యూయల్-మైక్రోఫోన్ AI నాయిస్ వంటి అనేక రకాల కొత్త ఫీచర్స్‌ను కలిగి ఉండబోతోంది.
ఇక ఈ ఇయర్‌బడ్స్‌కి సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే.. ఈ రెండింటిలో 58mAh బ్యాటరీలు ఉంటాయి. అంతేకాకుండా దీని కేస్ దాదాపు 440mAh వరకు బ్యాటరీ సెటప్‌లను కలిగి ఉంటుంది. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు 43 గంటల పాటు బ్యాటరీని అందిస్తుంది. అలాగే సులభంగా ఛార్జ్ చేసుకునేందుకు ప్రత్యేకమైన బ్యాటరీని అందిస్తోంది. అలాగే ఈ Enco Air 4 ఇయర్‌బడ్‌లు IP55 రేటింగ్ వాటర్ రిసిస్టెంట్ సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా టచ్ ఇంటరాక్షన్ సపోర్ట్ కూడా లభిస్తోంది..
ఈ ఇయర్ బడ్స్ డిజైన్ చాలా ప్రీమియం లుక్‌లో కనిపిస్తుంది. అంతేకాకుండా తేలికగా ఉండేలా కంపెనీ రెడీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది కేవలం దాదాపు 4.2 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉంటుంది. ఇక ఈ Oppo Enco Air 4 ఇయర్‌బడ్స్ ధర వివరాల్లోకి వెళితే, ఇది చైనా మార్కెట్‌లో 179 యువాన్ల ధరతో లభిస్తోంది. ఇక భారత్‌లో లాంచ్ అయితే సుమారు రూ. 2,100 ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది స్ప్రింగ్ గ్రీన్, ఫ్రాస్ట్ వైట్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.